Mrunal Thakur Bipasha Basu.. మగాడిలా వుండే బిపాషా బసుని ఎవరు పెళ్ళాడతారు.? అంటూ, మృణాల్ ఠాకూర్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి.
ఈ వ్యాఖ్యలపై బిపాషా బసు కూడా స్పందించింది. తన ఆవేదనని సోషల్ మీడియా వేదికగా వెళ్ళగక్కింది. ఆవేదన అంటే ఆవేదన కాదు, కౌంటర్ ఎటాక్.!
అయినా, మృణాల్ ఠాకూర్ ఎందుకు బాడీ షేమింగ్ చేసినట్లు.? మృణాల్ ఠాకూర్ కూడా బాడీ షేమింగ్ బాధితురాలే కదా.?
Mrunal Thakur Bipasha Basu.. కాలం చేసిన గాయం..
ఈ వివాదం ఇప్పటిది కాదు.. చాలా ఏళ్ళ క్రితం జరిగిన వ్యవహారం. కాకపోతే, ఇప్పుడు వైరల్ అయ్యిందంతే. అప్పట్లో మృణాల్ అంటే, పెద్దగా ఎవరికీ తెలియదు.
అప్పటికే, బిపాషా బసు చాలా పెద్ద స్టార్.! బిపాషా బసు తెలుసు కదా, తెలుగులో ‘టక్కరి దొంగ’ సినిమాలో ఓ కీలక పాత్రలో కనిపించింది. బాలీవుడ్‌లో అయితే సెన్సేషన్.

బిపాషా బొద్దుగానూ వుండేది, అలానే జీరో సైజ్ ఫిజిక్‌తోనూ కనిపించేది. మోడలింగ్ నుంచి సినిమాల్లోకి వచ్చింది బిపాషా బసు.
మృణాల్ ఠాకూర్, తనకు పంతొమ్మిదేళ్ళ వయసులో ఓ ఇంటర్వ్యూ సందర్భంగా, బిపాషా బసు మీద కామెంట్ చేసింది.. అదీ, బాడీ షేమింగ్ కామెంట్.
క్షమాపణ చెప్పిన మృణాల్ ఠాకూర్..
ఇన్నేళ్ళ తర్వాత ఒకప్పటి తన వ్యాఖ్యలు వివాదాస్పదమవడంతో మృణాల్ ఠాకూర్, సోషల్ మీడియా వేదికగా బిపాషా బసుకి క్షమాపణ చెప్పింది.
Also Read: అతను, ఆమె.. ఓ కారులో ప్రయాణిస్తే.. అదో పెద్ద క్రైమ్.!
తెలిసీ తెలియని వయసులో తాను చేసిన కామెంట్స్ అత్యంత బాధాకరమనీ, ఆ వ్యాఖ్యలపై మనస్తాపానికి గురైన బిపాాషా బసుకి క్షమాపణ చెబుతున్నానని పేర్కొంది మృణాల్ ఠాకూర్.
నిజానికి, ఈ విషయంలో మృణాల్ ఠాకూర్‌ని అభినందించి తీరాలి. మెచ్యూరిటీ లేని వయసు నుంచి మెచ్యూరిటీ వచ్చాక.. ఇప్పుడు, ఈ వయసులో అత్యంత బాధ్యతాయుతంగా వ్యవహరించిందామె.
బిపాసా ప్రస్తుతం సినిమాలకు దూరంగా వుంది. మృణాల్ ఠాకూర్ తెలుగు, తమిళ, హిందీ సినీ పరిశ్రమల్లో మంచి మంచి అవకాశాలు దక్కించుకుంటోంది.