‘సీతారామం’ సినిమా ముందు వరకూ ఆమె (Mrunal Thakur) ఎవరో పెద్దగా ఎవరికీ తెలియదు.! పలు టీవీ సీరియళ్ళలోనూ, ప్రకటనల్లోనూ కొన్ని హిందీ సినిమాల్లోనూ నటించిందామె.!
ఒకే ఒక్క సినిమా మృనాల్ ఠాకూర్ పేరు దేశవ్యాప్తంగా మార్మోగిపోయేలా చేసింది. అదే ‘సీతారామం’.!
పదహారణాల తెలుగమ్మాయ్‌లా ఒదిగిపోయింది మృనాల్ ఠాకూర్ ‘సీతారామం’ సినిమాలోని ‘సీత’ పాత్ర ద్వారా.
ఈ బ్యూటీ ఇప్పుడు మరో నేచురల్ పెర్ఫామెన్స్ ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. నేచురల్ స్టార్ నాని హీరోగా తెరకెక్కనున్న సినిమా కోసం మృనాల్ ఠాకూర్‌ని హీరోయిన్‌గా ఎంపిక చేశారు.
Mrunal Thakur మాత్రమే ఎందుకు.?
నాని సినిమాల్లో హీరోయిన్ పాత్రకి చాలా చాలా ఇంపార్టెన్స్ వుంటూ వస్తోంది ఈ మధ్యకాలంలో. అలా చూస్తే, మృనాల్ ఠాకూర్‌ని ఏరి కోరి ఈ సినిమా కోసం ప్రత్యేకంగా ఎంపిక చేసినట్లే అనిపిస్తోంది.

మృనాల్ మంచి నటి. ఆ విషయం ‘సీతారామం’ సినిమాతో ప్రూవ్ అయ్యింది. గ్లామరస్ రోల్స్ చేయాలని వున్నా, ప్రస్తుతానికైతే వస్తున్న పాత్రల్లో మంచి పాత్రల్ని ఎంచుకుంటోంది.
Also Read:
సోషల్ మీడియా ఎలాగూ వుంది గ్లామర్ షో కోసం.! అక్కడేమో గ్లామర్.. తెరపైనేమో పెర్ఫామెన్స్.. భలేగా బ్యాలన్స్ చేసేస్తోంది మృనాల్ ఠాకూర్.