హైపర్ ఆది వాడకం మామూలుగా లేదుగా.!

 హైపర్ ఆది వాడకం మామూలుగా లేదుగా.!

Hyper Aadi Trivikram Srinivas

Hyper Aadi Trivikram Srinivas.. హైపర్ ఆది అంటే కేవలం జబర్దస్త్ కమెడియన్ మాత్రమే కాదు, మంచి రచయిత కూడా.! అందుకే, సినిమాల్లో హైపర్ ఆదికి అవకాశాలు పోటెత్తుతున్నాయ్.

ఏకంగా త్రివిక్రమ్ శ్రీనివాస్ అంతటోడే, హైపర్ ఆది టాలెంట్‌కి కితాబులిచ్చాడంటే చిన్న విషయం కాదు.

‘సర్’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఆసక్తికరమైన సంఘటన చోటు చేసుకుంది. ఓ దర్శకుడు.. ఓ కమెడియన్ గురించి ఓ హీరోకి అద్భుతమైన ప్రెజెంటేషన్ ఇవ్వడమే ఆ ఆసక్తికరమైన సంఘటన.

హైపర్ ఆది మామూలోడు కాదు..

ప్రముఖ దర్శకుడు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్.. ‘హైపర్ ఆది’ గొప్పతనం గురించి హీరో ధనుష్‌కి వివరించారు.

జబర్దస్త్ అనే కామెడీ షోతో పాపులర్ అయి, సినీ నటుడిగా మంచి మంచి అవకాశాలు దక్కించుకుంటున్నాడని హైపర్ ఆది గురించి ధనుష్‌తో త్రివిక్రమ్ చెప్పారు.

అంతే కాదు, ‘జబర్దస్త్ కమెడియన్, సినీ నటుడు, రచయిత కూడా..’ అంటూ హైపర్ ఆది గురించి ధనుష్‌తో త్రివిక్రమ్ చెప్పడం గమనార్హం.

‘కొన్నాళ్ళ క్రితం ఓ ఈవెంట్‌లో హైపర్ ఆదికి వచ్చిన రెస్పాన్స్ చూసి నేను షాక్‌కి గురయ్యా.. తదుపరి ఈవెంట్స్‌లో.. నేను కూడా హైపర్ ఆదిని చూసి క్లాప్స్ కొడతా..’ అన్నాడు తమిళ హీరో ధనుష్.

Hyper Aadi Trivikram Srinivas.. పవన్ కళ్యాణ్ ప్రస్తావన..

కాగా, ‘సర్’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో పవన్ కళ్యాణ్ ప్రస్తావన తెచ్చాడు తనదైన స్టయిల్లో హైపర్ ఆది.

పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వాన్ని కీర్తిస్తూ, త్రివిక్రమ్ శ్రీనివాస్ – పవన్ కళ్యాణ్ స్నేహం గురించీ వివరిస్తూ, ఆ ఇద్దరికీ తాను వీరాభిమానినని చెప్పుకున్నాడు.

‘ఎక్కడ నెగ్గాలో కాదు.. ఎక్కడ తగ్గాలో తెలిసినోడే గొప్పోడు..’ అన్నది సినిమా డైలాగ్ మాత్రమే కాదనీ, పవన్ కళ్యాణ్ అలాగే త్రివిక్రమ్ శ్రీనివాస్ వ్యక్తిత్వాలకు అది నిదర్శనమన్నాడు హైపర్ ఆది.

Also Read: Anupama Parameswaran: ఫాఫం.. పాపది వన్ సైడ్ లవ్ స్టోరీ.!

మరోపక్క, హైపర్ ఆది వాడకంపై సోషల్ మీడియాలో సెటైర్ల వర్షం కురుస్తోంది. అదే సమయంలో, పవన్ కళ్యాణ్ అభిమానుల నుంచి మాత్రం హైపర్ ఆదికి బోల్డంత పాజిటివ్ అప్లాజ్ కూడా అభిస్తోంది.

Digiqole Ad

Related post