Mrunal Thakur Selfiee.. ‘సీతారామం’ సినిమాలో ఎంతో పద్ధతిగా కనిపించింది మృనాల్ ఠాకూర్.! ఆ సినిమా బంపర్ హిట్ అయ్యిన సంగతి తెలిసిందే.
తెలుగుతోపాటు, తమిళ, మలయాళ, కన్నడ సినీ ప్రేక్షకులూ.. అలాగే హిందీ ప్రేక్షకులూ ‘సీతారామం’ సినిమాని ఆదరించారు. ప్రత్యేకించి మృనాల్ ఠాకూర్‌కి ఫిదా అయిపోయారు.
పద్ధతైన పాత్రల్లో మృనాల్ ఠాకూర్ అయితే బావుంటుందంటూ దర్శక నిర్మాతలు ఆమె కోసం ప్రత్యేకంగా పాత్రలు డిజైన్ చేస్తున్నారు.
Mrunal Thakur Selfiee.. ఇదేం యాంగిల్ మహాప్రభో.!
మృనాల్ ఠాకూర్.. పైకి కనిపించేంత సాఫ్ట్ కానే కాదు.! ఆమె హై ఓల్టేజ్ గ్లామర్ ఏంటో తాజాగా నిరూపించింది.
బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ సినిమా ‘సెల్ఫీ’ కోసం రూపొందించిన ఓ పాట, మృనాల్ ఠాకూర్‌ని కొత్తగా ప్రపంచానికి పరిచయం చేస్తోందనొచ్చేమో.!
ఆ స్థాయిలో హాట్ అండ్ వైల్డ్‌గా కనిపించింది మృనాల్ ఠాకూర్ ఈ పాటలో. నెవర్ బిఫోర్.. అనేలా అందాల ప్రదర్శన చేసేసింది మృనాల్ ఠాకూర్.
ఆమె డాన్స్ మూమెంట్స్.. ఆమె కాస్ట్యూమ్స్.. నిజంగానే మృనాల్ ఠాకూర్‌లోని కొత్త యాంగిల్ అందరికీ తెలిసేలా చేసింది. నిజానికి, మృనాల్ హాట్ షో.. ఇదే కొత్త కాదు.
Also Read: సాయి ధరమ్ తేజ్ సరసన కేతిక శర్మ.?
కాకపోతే, ‘సీతారామం’ సినిమా చూసిన కళ్ళతో, ఇప్పడు మృనాల్‌ని ఇలా చూడాల్సి రావడం సమ్‌థింగ్ వెరీ స్పెషల్ అనొచ్చు.