Mrunal Yashna Thakur.. ఎవరీ మృణాల్ ఠాకూర్.! ‘సీతారామం’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ బ్యూటీ, అనూహ్యంగా తొలి తెలుగు సినిమాతోనే అందరి దృష్టినీ ఆకర్షించేసింది.
అలా ఇలా కాదు.! ‘మా తెలుగబ్బాయ్‌ని పెళ్ళి చేసేసుకుని, హైద్రాబాద్‌లోనే సెటిలైపో..’ అని చాలామంది ఆమెకు ఉచిత సలహాలిచ్చేంతలా, తెలుగమ్మాయ్ అయిపోయింది మృణాల్ ఠాకూర్.
తాజాగా, మృణాల్ ఠాకూర్ ‘యష్న’గా మారిపోయింది. తన తాజా చిత్రం ‘హాయ్ నాన్న’ (Hi Nanna)లో మృణాల్ ఠాకూర్ పాత్ర పేరు యష్న.!
Mrunal Yashna Thakur.. ప్రేమలో పడాల్సిందే..
తొలి సినిమా ‘సీతారామం’ పుణ్యమా అని మృణాల్ ఠాకూర్‌తో చాలామంది ప్రేమలో పడిపోయారు.! కుర్రకారు ఆ స్థాయిలో తమ గుండెల్లో ఆమెకు గుడి కట్టేశారు మరి.!
ఇక, ఇప్పుడు ‘హాయ్ నాన్న’ (Hi Nanna) సినిమాతో మరింతగా, మృణాల్ ఠాకూర్‌కి ‘ప్రేమ భక్తులు’ అయిపోతున్నారు కుర్రాకరు.!

యష్న.. ఐ లవ్ యూ.! అంటూ సోషల్ మీడియాలో మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) ఫొటోల్ని నెటిజన్స్ ఎడా పెడా పోస్ట్ చేసేస్తుండడం గమనార్హం.
ప్రతి ఫ్రేములోనూ..
‘హాయ్ నాన్న’ సినిమాలో మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) కనిపించిన ప్రతి ఫ్రేములోనూ, ఆమె సమ్‌థింగ్ స్పెషల్‌గా కనిపించింది.
ప్రతి ఎక్స్ప్రెషన్తోనూ ఆమె యువతరానికి గిలిగింతలు పెట్టింది. బోల్డంత గ్లామర్ పండిస్తే, వచ్చే ‘గ్లామరస్ అండ్ రొమాంటిక్’ ఇమేజ్, మృణాల్ ఠాకూర్‌కి చాలా సింపుల్‌గా వచ్చేసిందని చెప్పొచ్చేమో.!
Also Read: Lavanya Tripathi: కొత్త పెళ్ళికూతురి ‘లావణ్యం’.!
పదండి.. మృణాల్ యష్న ఠాకూర్‌తో ప్రేమలో పడిపోదామంటూ ‘హాయ్ నాన్న’ గురించి, మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) అభిమానులు సోషల్ మీడియాలో ప్రమోట్ చేస్తున్నారు.
దటీజ్ మృణాల్ ఠాకూర్.. అదేనండీ మృణాల్ యష్న ఠాకూర్.!
అన్నట్టు, మృణాల్ ఠాకూర్ తెలుగులో వరుస సినిమాలు చేసేస్తోంది. విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) సరసన ‘ఫ్యామిలీ స్టార్’ (Family Star) సినిమాలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్గా నటిస్తున్న సంగతి తెలిసిందే.!