ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2020 నుంచి చెన్నయ్ జట్టు ఔట్ అయిపోయింది. టైటిల్ ఫేవరెట్‌గా బరిలోకి దిగిన చెన్నయ్ సూపర్ కింగ్స్ జట్టు, అత్యంత పేలవమైన ప్రదర్శనతో పాయింట్స్ టేబుల్‌లో అట్టడుక్కి దిగజారిపోయింది. ప్లే-ఆఫ్స్ అన్న ఆలోచనే లేదిప్పుడు చెన్నయ్ సూపర్ కింగ్స్ జట్టుకి (Ms Dhoni Flop Show IPL2020).
నిజానికి, చెన్నయ్ సూపర్ కింగ్స్ జట్టుకి ఇది అత్యంత ప్రతిష్టాత్మకమైన సీజన్. ఎందుకంటే, అంతర్జాతీయ క్రికెట్‌కి పూర్తిస్థాయిలో గుడ్ బై చెప్పేశాక, మహేంద్ర సింగ్ ధోనీ ఆడుతున్న తొలి ఐపీఎల్ సీజన్ ఇది. ఈ సీజన్‌తో ధోనీ, ఈ ఫార్మాట్‌కి కూడా గుడ్ బై చెబుతాడన్న ప్రచారం జరిగింది.
దాంతో, ఈ సీజన్‌ని అత్యంత గౌరవ ప్రదంగా ముగించాలనీ, ఈ క్రమంలో టైటిల్ కొల్లగొట్టాలనీ చెన్నయ్ సూపర్ కింగ్స్‌పై అభిమానులు చాలా ఆశలు పెట్టుకున్నారు. కానీ, ఆ ఆశలన్నీ వమ్ము అయ్యాయి. ఎప్పుడైతే, సురేష్ రైనా జట్టుకి దూరమయ్యాడో.. అప్పుడే చాలామందికి చాలా అనుమానాలు కలిగాయి.
రైనా లేకపోతేనేం, ధోనీ వున్నాడుగా.. అని నమ్మిన అభిమానులకు, ధోనీ ఫెయిల్యూర్స్ మరింత బాధ కలిగించాయి. ఇదివరకటి ధోనీ ఒక్కటంటే ఒక్క మ్యాచ్‌లో కూడా కనిపించలేదు. కెప్టెన్సీలోగానీ, బ్యాటింగ్‌లోగానీ.. ధోనీ మెరుపులు లేవు. వికెట్ కీపింగ్ వరకూ జస్ట్ ఓకే.
అయినా, ఒక్క ధోనీనే నిందించడానికి వీల్లేదు. జట్టులో కీలక ఆటగాళ్ళవరూ ఈ సీజన్‌ని సీరియస్‌గా తీసుకున్నట్టు కనిపించలేదన్నది అభిమానుల నుంచి వస్తోన్న ముఖ్యమైన ఫిర్యాదు. అది నిజం కూడా.
యువ ఆటగాళ్ళకు ధోనీ అవకాశమివ్వలేదెందుకు.? అన్న ప్రశ్నలు వచ్చాయిగానీ, అవకాశం వచ్చినా ఏ యంగ్ ప్లేయర్ కూడా తన టాలెంట్‌ని ప్రూవ్ చేసుకోలేకపోయాడు.
ఓవరాల్‌గా ఈ సీజన్ చెన్నయ్ సూపర్ కింగ్స్ అభిమానులకి ఓ పీడ కల అని అనుకోవాలేమో. ఇక, ధోనీ ఐపీఎల్‌కి కూడా గుడ్ బై చెప్పే సమయం వచ్చేసినట్లేనా.? అంతే, అంతకు మించి వేరే ఛాన్సే లేదు. ఎందుకంటే, ఇంతటి అవమానకరమైన ఓటమి తర్వాత.. ధోనీ మళ్ళీ పుంజుకోవడం సాధ్యమయ్యే పనే కాదు.!