చెన్నయ్ సూపర్ కింగ్స్ (Chennai Super Kings) జట్టు గెలవాలని కోరుకునే అభిమానులు చాలా ఎక్కువమందే వున్నారు. అదే సమయంలో, జట్టు ఓడినా గెలిచినా.. మహేంద్ర సింగ్ ధోనీ (Mahendra Singh Dhoni) కొట్టే సిక్సర్లను చూడాలని (Ms Dhoni Is Back) ఎదురుచూసేవాళ్ళు ఇంకా ఎక్కువమంది వుంటారు.
అసలు మళ్ళీ ధోనీలో మునుపటి పవర్‌ని చూడగలమా.? అని అంతా ఆందోళన చెందుతున్న వేళ, ‘ఐ యామ్ బ్యాక్..’ అంటూ ధోనీ బ్యాట్ ఝుళిపించేశాడు. అలా ఇలా కాదు.. బ్యాక్ టు బ్యాక్ మూడు సిక్సర్లు బాదేశాడు. చెన్నయ్ సూపర్ కింగ్స్ జట్టు, ‘అండర్ డాగ్’ రాజస్తాన్ రాయల్స్ చేతిలో ఓడినా, ధోనీ కొట్టిన సిక్సర్లు చెన్నయ్ సూపర్ కింగ్స్ అభిమానులకు బోల్డంత తృప్తినిచ్చాయన్నది నిర్వివాదాంశం.
మొదటి మ్యాచ్‌ని ముంబైపై ధోనీ సేన నెగ్గినా, ధోనీ ఆ మ్యాచ్‌లో ‘గట్టిగా బాదలేకపోవడం’ అభిమానుల్ని కొంత ఆందోళనకు గురిచేసింది. రాజస్తాన్‌తో మ్యాచ్‌లోనూ ధోనీ తొలుత చాలా నెమ్మదిగా ఆడాడు. ఇంకో ఎండ్‌లో డుప్లెసీ సిక్సర్ల మోత మోగిస్తోంటే, ధోనీ చూస్తూ వుండిపోవాల్సి వచ్చింది.
కానీ, చివరి ఓవర్‌లో మాత్రం.. ఎడా పెడా మూడు సిక్సర్లు బాదేశాడు. కాస్త ముందుగానే ధోనీ ఈ ‘పవర్’ చూపించి వుంటే, చెన్నయ్ సూపర్ కింగ్స్ జట్టు అత్యద్భుత విజయాన్ని అందుకుని వుండేదే. ఏదిఏమైనా, దాదాపు ఏడాది కాలం తర్వాత మైదానంలో బ్యాట్ పట్టిన ధోనీ నుంచి ఈ స్థాయి ప్రదర్శన అంటే.. అభిమానులకి అంతకన్నా అమితాశ్చర్యం ఇంకేముంటుంది.?
విమర్శకుల నోళ్ళు కూడా మూత పడిపోయాయి. ఏజ్ ఈజ్ జస్ట్ నెంబర్.. కొందరికి. ఆ కొందరిలో ధోనీ కూడా ఒకడు. ధోనీ మెదడులో ఆలోచనలు చాలా వేగంగా పరిగెడతాయి. వికెట్ల వెనకాల వుండి.. మొత్తం మ్యాచ్‌ని కంట్రోల్ చేసెయ్యగలడు. స్టాండ్స్‌లో వున్నా.. అంతే.
దటీజ్ ధోనీ. చెన్నయ్ సూపర్ కింగ్స్ జట్టు ఈ సీజన్‌లోనూ టైటిల్ ఫేవరెట్ అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు కదా.! కాగా, అంబటి రాయుడు ఈ మ్యాచ్‌లో మిస్సయ్యాడు. అది కొంత అభిమానులకు నిరాశ కలిగించింది.