MS Dhoni Sweet Warning.. మిస్టర్ కూల్.. మహేంద్ర సింగ్ ధోనీకి కూడా కోపమొచ్చింది.! తప్పదు మరి.. జట్టు విజయావకాశాల్ని బౌలర్లు దెబ్బ తీస్తోంటే, కోపం రాకుండా ఎలా వుంటుంది ఏ కెప్టెన్‌కి అయినా.!
అంతర్జాతీయ క్రికెట్ నుంచి ఇప్పటికే రిటైర్మెంట్ తీసుకున్న ధోనీ, ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో మాత్రం కొనసాగుతున్నాడు. చెన్నయ్ సూపర్ కింగ్స్ జట్టుకి ధోనీనే బలం.!
ధోనీ నేతృత్వంలో చెన్నయ్ సూపర్ కింగ్స్ జట్టు గతంలో ఎన్నో అద్భుతాలు చేసింది. అయితే, ఈ మధ్య వేడి తగ్గింది. తాజా ఐపీఎల్ సీజన్‌లో చెన్నయ్ సూపర్ కింగ్స్ జట్టు ప్రదర్శన ప్రస్తుతానికైతే ఓకే.!
MS Dhoni Sweet Warning.. స్వీట్ వార్నింగ్.. ఎందుకబ్బా.?
బౌలర్లు పరిస్థితులకు తగ్గట్టుగా రాణించడం లేదన్నది ఎమ్మెస్ ధోనీ ప్రధాన ఆరోపణ. అది నిజం కూడా.! చెన్నయ్ సూపర్ కింగ్స్ (Chennai Super Kings) జట్టు అభిమానులూ ఇదే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ప్రత్యర్థి బౌలర్లు సమర్థవంతంగా బౌలింగ్ చేయగలుగుతున్నప్పుడు మనమెందుకు చేయలేకపోతున్నాం.? అని సీఎస్కే బౌర్లను ధోనీ (MS Dhoni IPL) ప్రశ్నించాడు. గట్టిగా నిలదీశాడు కూడా.!

వైడ్లు, నోబాల్స్.. ఇవి జట్టు విజయావకాశాల్ని దెబ్బ తీస్తాయన్న ధోనీ (MS Dhoni), ప్రధాన బౌలర్లు తమ ఆటతీరు మెరుగుపరచుకోకపోతే, కెప్టెన్సీ నుంచి వైదొలగుతాననీ హెచ్చరించాడు.
సాధారణంగా అయితే, ధోనీ (Mahendra Singh Dhoni Indian Premiere League) ఇంతలా అసహనం వ్యక్తం చేయడం చాలా చాలా అరుదు.
బహుశా ఈ సీజన్ తర్వాత, ఐపీఎల్‌కి (Indian Premiere League) కూడా గుడ్ బై చెప్పాలనే ఆలోచనలో ధోనీ (Ms Dhoni) వున్నాడేమో.! అందుకే, ఈ అసహనం.?
పెద్దన్న సూచన మాత్రమే..
అయితే, ఇది వార్నింగ్ కాదు.. పెద్దన్న చేసిన సూచన మాత్రమేనని చెన్నయ్ సూపర్ కింగ్స్ (Chennai Super Kings) అభిమానులంటున్నారు.
Also Read: Nokia Connecting People.! నోకియా అంటే అదొక ఎమోషన్.!
వికెట్ల వెనుకాల కీపింగ్ చాలా కష్టమైన పని అనీ, ఈ వయసులోనూ ధోనీ సత్తా చాటడమే కాదు, బౌలర్లను అనుక్షణం గమనిస్తుండడం జట్టు పట్ల అతని కమిట్మెంట్‌ని తెలియజేస్తోందన్నది మెజార్టీ అభిప్రాయం.