Table of Contents
MUDRAnalysis On Social Media.. ప్రధాన మంత్రి అయినా.. ప్రముఖ సినీ నటుడైనా.. సామాజిక వేత్త అయినా.. న్యాయమూర్తి అయినా.. వాళ్ళకి లెక్కే లేదు.!
ఇంతకీ ఎవరు వాళ్ళు.? ఇంకెవరు, సామాజిక ఉన్మాదులు.! నెటిజనం అనండీ.. ఇంకేదన్నా పేరు పెట్టండి.!
వందల్లో.. వేలల్లో.. లక్షల్లో.. కోట్లలో వున్నారు నెటిజనం.! ప్రపంచం చాలా మారిపోయింది. ఇప్పుుడు దీన్నొక కుగ్రామంగా అభివర్ణించొచ్చేమో కూడా.!
అమెరికా అధ్యక్షుడ్ని తిట్టగలం.. సుప్రీంకోర్టు న్యాయమూర్తినీ తూలనాడగలం.! అదీ, ప్రపంచంలో ఏ మూల నుంచైనాగానీ.!
చేతి వేళ్ళతో అరాచకం.!
ఔను, ఇది అరాచకమే.! జడ్జిల్ని చంపెయ్యాలంటాడు ఒకరుడు.. ప్రధాన మంత్రిని తుదముట్టించేయాలంటాడు మరొకడు.
సినీ నటుల జీవితాల్ని రోడ్డుకి లాగేయాలని చూస్తారు ఇంకొందరు. అసలేం జరుగుతోంది.? సామాజిక మాధ్యమాల ‘సృష్టి’ వెనుక అసలు కారణమేంటి.?
కాదేదీ కవితకనర్హం అంటాడో కవి.! కానీ, కాదేదీ ట్రోలింగుకి అనర్హం.. అన్నట్టు తయారైంది పరిస్థితి. జుగుప్స.. అత్యంత జుగుప్స.. అంతకు మించి.. అనే స్థాయికి దిగజారిపోయింది పరిస్థితి.
దిగజారిపోవడంలో ఎప్పటికప్పుడు కొత్త లోతుల్ని సోషల్ మీడియాలో కొందరు నెటిజన్లు కనుగొనేందుకు ప్రయత్నిస్తున్నారు.
నిజానికి, సోషల్ మీడియా అనే ఉద్దేశ్యం మంచిదే.. కానీ, సామాజిక మాధ్యమాలనేవి ‘నేరాలకు అడ్డా’గా మారిపోతుండడమే అత్యంత బాధాకరం.
MUDRAnalysis On Social Media.. ఇంటర్నెట్ హత్యాచారం..
దీన్ని ఇంటర్నెట్ అత్యాచారం అనీ.. సామాజిక హత్య.. అనీ.. రకరకాల పేర్లు పెడుతున్నారు. నిజమే, దీనికి ఏ పేరు అయినా పెట్టొచ్చరు.
నర రూప రాక్షసులు అంటాం కదా.! నెట్టింట రాక్షసులు.. అనుకోవచ్చు. సోషల్ వేధింపులే, సెలబ్రిటీల మానసిక సమస్యలకు ప్రధాన కారణాలవుతున్నాయనడం అతిశయోక్తి కాదు.!
ఎలా.? దీనికి అడ్డుకట్ట వేసేది.? భావ ప్రకటనా స్వేచ్ఛ కింద చూడాలా.! ఆ ముసుగులో సోషల్ అత్యాచారాలకు పాల్పడుతున్నవారిని క్షమించి వదిలెయ్యాలా.?
సెల్ఫ్ సెన్సార్ వుండాలి.! కానీ, అది సాధ్యం కాదు.! చట్టాలున్నాయి.. వాటి అమలు విషయంలో ప్రభుత్వాలు బాధ్యతగా వ్యవహరించడంలేదు.
రాజకీయ కక్ష సాధింపు చర్యల కోసం మాత్రమే, కొన్ని చట్టాల్ని పాలకులు వినియోగిస్తుండడం.. పోలీస్ వ్యవస్థ కూడా, అందుకు అనుగుణంగా పనిచేస్తుండడం.. ఇవన్నీ కాదనలేని వాస్తవాలు.!
సమాజాన్ని పట్టి పీడిస్తున్న అనేక రుగ్మతుల్లో సోషల్ మీడియా కూడా ఒకటిప్పుడు.! ఔను, ఇదొక రోగం.! దీనికి చికిత్స లేదా.? అంటే, సరైన చికిత్స జరగడంలేదని చెప్పొచ్చు.
MUDRAnalasys On Social Media.. నాణానికి ఇంకో వైపు..
సోషల్ మీడియాలో అంతా ఛండాలమే అని చెప్పలేం.! సామాజిక మాధ్యమాల ద్వారా ఎంతోమందికి ఉపాధి దొరుకుతున్నమాట వాస్తవం.
Also Read: Manipur Women Violence.. సిగ్గు పడదాం.! కానీ, ఎలా.?
అందుకు అనుగుణంగా ఆయా వేదికలు, వినియోగదారుల్ని ప్రోత్సహిస్తున్నాయి కూడా. ఇక్కడా మళ్ళీ, ఆ సంపాదన, ఇతరుల జీవితాలతో చెలగాటడం ఆడటం ద్వారానే అంటే.. దాన్ని క్షమించలేం.
మంచీ.. చెడూ.. రెండూ వున్నాయ్.! కానీ, మంచిని చెడు డామినేట్ చేస్తోంది. ఇది సోషల్ మీడియా యుగం మాత్రమే కాదు.. కలియుగం మరి.!
– yeSBee