Table of Contents
బిగ్‌హౌస్‌లో (Bigg Boss 3 Telugu) నయా గ్రూపులు ఫామ్ అయ్యాయి. హౌస్‌మేట్స్ అంతా గ్రూపులుగా (Bigg Boss Groups) విడిపోయారు. ఈ విషయాన్ని ఈ వారం హౌస్ నుండి బయటికొచ్చిన జాఫర్ (Jaffar) డిక్లర్ చేశారు.
దాంతో కంటెస్టెంట్ల మధ్య గ్రూపుల వ్యవహారం ఇంకా బాగా ఎలివేట్ అవడమే కాదు, అది కంటెస్టెంట్ల మధ్య కూడా చిచ్చుపెట్టంది. ప్రధానంగా బాబా భాస్కర్ (Baba Bhaskar), కొందరికి విలన్ అయిపోవడం, జాఫర్ చేసిన నేరంగానే భావించాలి.
జాఫర్ బయటికొచ్చాక హౌస్‌లోని పరిస్థితుల సమీక్ష చూస్తే, వితిక షెరు (Vithika Sheru), వరుణ్ సందేష్ (Varun Sandesh), పునర్నవి భూపాలం (Punarnavi Bhupalam), రాహుల్ సిప్లిగంజ్ (Rahul Sipligunj) నలుగురూ ఓ గ్రూపుగా ఉంటున్నారు. ఆపోజిట్ గ్రూప్స్‌కి సంబంధించిన డిస్కషన్స్ వీరి మధ్య నడుస్తున్నాయి.
బుక్కయిపోయావ్ బాబా..
బాబా భాస్కర్ గేమ్‌ని చాలా స్ట్రాటజిక్‌గా ఆడుతున్నారనీ, మహేష్ డేంజరస్ అనీ, హిమజ (Himaja), అషూ కూల్ అనీ శివ జ్యోతి (Siva Jyothi Savitrakka) కూడా కొంచెం క్రిటికలే అనీ, అలీతో జాగ్రత్తగా ఉండాలనీ ఈ గ్రూప్ సభ్యులు డిస్కస్ చేస్తున్నారు.
ఇంకో గ్రూప్ విషయానికొస్తే బాబా భాస్కర్ గ్రూప్ అని చెప్పాలి. ఈ గ్రూప్‌లో శ్రీముఖి (Sree Mukhi), మహేష్ (Mahesh Vitta), హిమజ (Himaja), ఒక్కోసారి తమన్నా సింహాద్రి (Tamanna Simhadri).. ఇలా కొనసాగుతున్నారు.
అయితే, మనకి కనిపించేది ఒకటి, లోపల జరుగుతున్నదొకటి. డైలీ షోలో మనకి ఎడిట్ చేసి చూపిస్తున్నది ఒకటి, బజ్ పేరుతో చూపిస్తున్నదొకటి. హాట్ స్టార్స్ వంటి యాప్స్‌లో చూపిస్తున్నది ఇంకోటి.. ఏదో ఒక్క దాన్ని ప్రామాణికంగా తీసుకుని అంచనా వేయలేం. కానీ, హౌస్‌లో ఏ ఒక్కరూ తక్కువయితే కాదని చెప్పగలం.
ముదుర్లు బాబోయ్ ముదుర్లు.. Bigg Boss Groups
అందరూ ముదుర్లే. ఎవరి స్ట్రాటజీలు వారివి. సందర్భం వచ్చినప్పుడు ఆ సందర్భానికి అనుగుణంగా వారిలోని యాంగిల్స్ బయటికి తీస్తున్నారు. ఇదిలా ఉంటే, తాజాగా ఓ కొత్త జంట హౌస్‌లో సందడి చేస్తోంది. వారే రాహుల్ – పునర్నవి. వీరి మధ్య నడుస్తున్న కెమిస్ట్రీ జస్ట్ ఫర్ ఫన్ అయినా, సమ్‌థింగ్ సమ్‌థింగ్ అనేలా వైబ్స్ క్రియేట్ అవుతున్నాయి.
మరోవైపు వరుణ్ – వితికలను (Varun Vithika) విడగొట్టేందుకు కుట్రలు జరుగుతున్నట్లు కనిపిస్తోంది. మహేష్, బాబా భాస్కర్ ఈ విషయమై చర్చలు జరుపుతున్నారు. అయితే, వితికను (Vithika Varun) బయటికి పంపిస్తే, బయటి నుండి అంతా చక్కబెట్టేస్తుందనే అనుమానాలు కూడా వీరిలో ఉన్నాయి.
భార్య, భర్తలు అయినప్పటికీ, మేం మామూలు కంటెస్టెంట్స్‌లానే ఉంటున్నామంటూ ఎంత మొత్తుకుంటున్నా, ఎవరూ నమ్మకపోయేసరికి అందరూ అనుకుంటున్నట్లుగానే గ్రూప్ తడాఖా ఏంటో చూపిస్తాం అంటూ వితిక ఛాలెంజ్ చేసింది. దాంతో వరుణ్ అండ్ గ్రూప్ ఎక్కువగా స్క్రీన్ స్పేస్‌ని కవర్ చేస్తున్నారు.
నామినేషన్స్.. అదో పెద్ద రచ్చ.. Bigg Boss Groups
ఇక నామినేషన్స్ విషయానికి వస్తే, గ్రూప్స్ వైజ్‌గా ‘నువ్వు వీళ్లను నామినేట్ చేయ్, నేను వాళ్లను నామినేట్ చేస్తాను..’ అంటూ మాట్లాడుకుంటున్నారు. ఖచ్చితంగా వరుణ్ గ్రూప్ (Bigg Boss Groups) నామినేషన్‌లో ఉండాల్సిందే.. అని మిగిలిన హౌస్ మేట్స్ కోరుకుంటున్నారు. ఇప్పటికి ఈ వారం నామినేషన్ల పర్వం అయితే ముగిసింది. వరుణ్ కెప్టెన్సీ కారణంగా నామినేషన్ నుండి తప్పించుకున్నాడు.
కానీ, వీరి గ్రూప్‌కి సంబంధించి వితిక, పునర్నవి, రాహుల్ నామినేట్ అయ్యారు. అనదర్ గ్రూప్‌గా ప్రచారంలో ఉన్న బాబా భాస్కర్ గ్రూప్ నుండి, ఈ సారి అనూహ్యంగా బాబా భాస్కర్ నామినేట్ అయ్యారు.
ఇదిలా వుంటే, హౌస్‌లో బ్యాడ్ బిహేవియర్‌తో, అత్యధిక ఓట్లతో తమన్నా కూడా నామినేట్ అయ్యింది. మొత్తానికి ఈ వారం ఈ ఐదుగురు హౌస్ మేట్స్‌లో (Bigg Boss Groups) ఎవరు బిగ్ హౌస్ నుండి బయటికి రాబోతున్నారనేది వేచి చూడాలిక. ఎవరు బయటకు వస్తారు.. ఎవరు హౌస్ లో కొనసాగుతారు? అనే విషయాల్ని పక్కన పెడితే.. ఈ ముదుర్లు తమ ఇమేజ్ మాత్రం పాడు చేసుకుంటున్నారు తమ చర్యలతో..