Table of Contents
Mumait Khan Bigg Boss Telugu: ఇది మరీ టూమచ్.! ఇలా బిగ్ బాస్ రియాల్టీ షో తెలుగు వెర్షన్‌కి సంబంధించి ప్రతిసారీ అనుకుంటూనే వున్నారు ఫాఫం బిగ్ బాస్ అభిమానులు. అదేంటో, మొదటి సీజన్ నుంచి ఐదో సీజన్ వరకూ ఒకటే తంతు నడిచింది.
పోనీ, బిగ్ బాస్ నాన్ స్టాప్ పేరుతో వచ్చిన ఓటీటీ వెర్షన్‌కి అయినా మార్పులేమైనా వుంటాయా.? అంటే, అదీ లేదాయె. మొదటి వారం ముమైత్ ఖాన్ వికెట్ పడిపోయింది.
Mumait Khan Bigg Boss Telugu.. ఫాలోయింగ్ సరిపోదు.. ఇంకోటేదో కావాలి.!
అదేంటీ, హౌస్‌లో చాలామంది కంటెస్టెంట్లతో పోల్చితే ముమైత్ ఖాన్‌కి కాస్త ఫాలోయింగ్ ఎక్కువే. ఎందుకంటే, ఆమె బోల్డన్ని సినిమాలు చేసింది.. ఆమె చేసిన ఐటమ్ సాంగ్స్ ఇప్పటికీ మార్మోగుతూనే వున్నాయి.
ఫాలోయింగ్ వుంటే మాత్రం ఓట్లు పడితేనే కదా హౌస్‌లో కొనసాగేది.? అంటే, అది మళ్ళీ వేరే లెక్క. ఎవరెవరు కంటెస్టెంట్లుగా ఖాయమవుతారో ముందే లీక్ అయిపోతోంది. ఇది ప్రతిసారీ కొనసాగుతున్న డ్రామానే.
సో, ముందస్తుగానే కంటెస్టెంట్లు తగు ఏర్పాట్లు చేసుకుంటున్నారు ఓటింగ్ కోసం. అలా, ఆయా కంటెస్టెంట్లకు ఓట్లు పడుతున్నాయి. దీనర్థం జరుగుతున్నది జెన్యూన్ ఓటింగ్ కానే కాదనేగా.!
ఇదేం ఓటింగ్ మహాప్రభో.!
నో డౌట్, బిగ్ బాస్ రియాల్టీ షో తెలుగు వెర్షన్‌కి సంబంధించి అస్సలేమాత్రం జెన్యూన్ ఓటింగ్ లేదనీ, అంతా పెయిడ్ ఓటింగ్ అనీ తెలిసిపోయినా, ఆ ఓట్ల ఆధారంగా ఎలిమినేషన్.. అంటూ కవరింగ్ ఇవ్వడం బిగ్ హోస్ట్ అక్కినేని నాగార్జునకి అలవాటైపోయింది.
రెండోస్సారీ.. అదే కిరికిరీ.!
ఇక, ముమైత్ ఖాన్ విషయానికొస్తే, తన మీద అగ్రెసివ్.. అనే ముద్ర వేసి, తనను చెడుగా చూపించారంటూ వాపోయింది. హౌస్‌లో ‘పనికిరానివాళ్ళు’ చాలామందే వున్నారన్న విషయాన్నీ స్పష్టం చేసేసింది.
అన్నట్టు, ముమైత్ ఖాన్ బిగ్ బాస్ గతంలో కూడా ఓ సారి బిగ్ హౌస్‌లో కంటెస్టెంట్‌గా పార్టిసిపేట్ చేసింది. అప్పుడామె టాలీవుడ్ డ్రగ్స్ కేసు వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంది.. విచారణ నిమిత్తం హౌస్ నుంచి బయటకు వచ్చి, విచారణ తర్వాత మళ్ళీ హౌస్‌లోకి వెళ్ళిందండోయ్.!
Also Read: కాజల్ సంచలనం.. బతకండి.. బతకనివ్వండి.!
అప్పుడు కూడా ముమైత్ తనకు బిగ్ బాస్ వల్ల అన్యాయమే జరిగిందంటూ వాపోయిన సంగతి తెలిసిందే. తెలిసీ, రెండోసారి ఆ హౌస్‌లోకి ఎందుకు వెళ్ళినట్లు.? అదే మరి, బిగ్ బాస్ మ్యాజిక్ అంటే.
ఒక్కటి మాత్రం నిజం.. ‘ముందుగానే ఎలిమినేట్ అయిపోవడం బెటర్.. చివరిదాకా వుండి క్యారెక్టర్ లాస్ చేసుకోవడం శుద్ధ దండగ.. ముమైత్ ఖాన్‌కి బిగ్ బాస్ వల్ల వచ్చే అదనపు పాపులారిటీ ఏమీ లేదు..’ అంటూ ఆమె అభిమానులే కాదు, సగటు బిగ్ బాస్ వీక్షకులు కూడా అభిప్రాయ పడుతున్నారంటే, అందులో వాస్తవం లేకపోలేదు మరి.!
