Table of Contents
Munagaku Health Benifits.. మునక్కాయను ఇష్టపడే వాళ్లుంటారు కానీ, మునగాకును ఇష్టపడేవారెంత మంది వుంటారు చెప్పండి.! ఏదో ప్రత్యేకమైన పండగకో, పబ్బానికో ఫార్మాలిటీ కోసం మునగాకు కూరను వండుతుంటారు మన తెలుగు వాళ్లు.
కానీ, మునగాకుతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే క్రమం తప్పకుండా వండుకుంటారు. వద్దన్నా ఇష్టపడి తింటారు. అవేంటో తెలుసుకుందా.?
ఏ వయసు వారికైనా ఆరోగ్య పరంగా మునగాకు ఎంతో మేలు చేస్తుంది. ముఖ్యంగా ఎముకలు ధృడంగా చేసేందుకు తోడ్పడుతుంది కనుక, పిల్లలూ, వృద్ధులూ తప్పక తినాల్సిన ఆకుకూరల్లో ఇదొకటి.
Munagaku Health Benifits.. డయాబెటిస్‌కి మునగాకు దివ్యౌషధం.!
మునగాకులో క్లోరో జెనిక్ యాసిడ్ అధికంగా వుంటుంది. ఇది రక్తంలోని చక్కెర స్థాయుల్ని అదుపులో వుంచుతుంది. అందుకే డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు మునగాకు తింటే ఇన్సులిన్ జోలికి పోనక్కర్లేదు.

Munagaku Health Benifits
మునగాకులో (Moringa Leaves) విటమిన్ ఎ, విటమిన్ సి అధికంగా వుంటాయ్. అలాగే, ఐరన్, కాల్షియం కూడా పుష్కలంగా లభిస్తాయ్.
ఆస్తమాకి మనుగాకు చాలా మంచిది. గుప్పెడు మునగాకుల్ని వేడి నీటిలో వేసి మరిగించి అందులో చిటికెడు మిరియాల పొడి, ఉప్పు, నిమ్మరసం కలిపి తీసుకుంటే ఆస్తమా తగ్గుముఖం పడుతుంది.
గర్భిణులు మునగాకు తినొచ్చా.?
గర్భిణీ స్ర్తీలు మునగాకు (Moringa Leaves) తినకూడదన్న అనుమానాలున్నాయ్ కొందరిలో. కానీ, మునగాకులోని ఫోలిక్ యాసిడ్ గర్భిణీ స్ర్తీలకు ఎంతో మంచిది.
ఫోలిక్ యాసిడ్ తగు మోతాదులో వుంటే, పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంగా పుడుతుంది. కావల్సినంత ఐరన్, కాల్షియం అందుతాయ్.
అలాగే, బాలీంతలకు పాలు సమృద్ధిగా పడాలన్నా మునగాకు (Moringa Leaves) వాడితే మంచిదని నిపుణులు చెబుతున్నారు.
మొటిమలకు మునగాకుతో చెక్.!
హార్మోన్స్ ఇమ్బ్యాలెన్స్ వల్ల వచ్చే మొటిమలకు మునగాకు మంచి చికిత్స. మార్కెట్లో లభించే అనేక రకాల పింపుల్ క్రీమ్స్ తాత్కాలికంగా మాత్రమే ఈ సమస్యను తగ్గిస్తాయ్.

Munagaku Health Benifits
కానీ, మునగాకులు మొటిమలు (Pimples), వాటి వల్ల ఏర్పడే బ్లాక్ హెడ్స్‌ని శాశ్వతంగా సమర్ధవంతంగా తగ్గిస్తాయ్. గుప్పుడు మునగాకు రసంలో కాస్త నిమ్మరసం జోడించి ముఖానికి పట్టిస్తే సరిపోతుంది.
మొటిమలే కాదు, వాటి వల్ల వచ్చే నల్లని మచ్చలు (Black Heads) సైతం తొలగిపోతాయ్. ఏదో మెడిసన్ అన్నట్లుగా కాకుండా, అద్భుతమైన రుచి గల వంటకాలను మునగాకుతో చేసి ఇష్టంగా ఆరగించొచ్చు.
Also Read : కోవిడ్ వ్యాక్సిన్ గుచ్చారు.! గుండె జబ్బులు అంటగట్టారు.?
ఇన్ని ఆరోగ్య లాభాలున్న మునగాకును (Moringa Leaves Or Drum Stick Leaves) తప్పకుండా డైలీ మెనూలో చేర్చుకోవల్సిందేగా.!
గమనిక: వంటింటి చిట్కాలు చిన్న చిన్న సమస్యలకు తేలికైన పరిష్కారాలు చూపుతాయి. అయితే, ఏ చిట్కా విషయంలో అయినా వైద్య సలహా తీసుకోవడం అత్యుత్తమం.
ఎందుకంటే, మనం వాడే ప్రతి వస్తువూ కల్తీ అయిపోతోంది.. వంటింటి చిట్కాల్లో ఈ కల్తీ సరుకు తెచ్చే అనర్థాలు తక్కువేం కాదు సుమీ..అలాగే, పురుగుల మందులు చల్లిన ఆకుకూరల విషయంలో అప్రమత్తంగా వుండాలి. జర జాగ్రత్త. కేవలం కొద్ది పాటి అవగాహన కోసం మాత్రమే ఈ సంకలనం.