Nabha Natesh iShow.. ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేష్‌ని ఈ మధ్య ఎవ్వరూ పట్టించుకోవడం లేదు పాపం. కానీ, ఈ ముద్దుగుమ్మ మాత్రం సోషల్ మీడియాలో హాట్ ఫోటోలతో రెచ్చిపోతూనే వుంది.
‘ఇస్మార్ట్ శంకర్’ ఇచ్చిన హిట్‌కి నభా నటేష్ దశ తిరిగిపోయిందనుకున్నారంతా. ఏకంగా పూరీ జగన్నాధ్‌తో ప్రశంసల జల్లు కురిపించేసుకుంది కూడా ఈ ముద్దుగుమ్మ.
ఇలియానా 2.0 అనే ట్యాగ్ ఇచ్చి మునగచెట్టు ఎక్కించేశాడు పూరీ ఏకంగా. అంతా బాగానే వుంది. ఆ సినిమాతో నిజంగానే అంత క్రేజ్ తెచ్చుకుంది నభా నటేష్.
Nabha Natesh iShow.. గ్లామర్ జిగేల్.. వెండి వెన్నెలకే సెగల్ సెగల్.!
కానీ, ఆ క్రేజ్ ఎంతో కాలం నిలబడలేదు. ఆ తర్వాత ‘అల్లుడు అదుర్స్’ వంటి ఒకటీ అరా సినిమాలతో సరిపెట్టుకోవల్సి వచ్చిందంతే.

ఈ మధ్య ఓ యాక్సిడెంట్ కారణంగా కొన్ని నెలలు గ్లామర్‌కి దూరంగా వుండిపోయింది నభా నటేష్ (Nabha Natesh).
మళ్లీ ఇప్పుడిప్పుడే తనలోని గ్లామర్ యాంగిల్స్‌ని ఎగ్జిబిషన్‌కి పెడుతూ నెటిజన్స్ అటెన్షన్ క్యారీ చేస్తోంది.
Also Read: ఎన్టీవోడూ.! నీ మనవడు మొహం చాటేశాడూ.!
తాజాగా పింక్ అండ్ సిల్వర్ కాంబో శారీలో తళుక్కున మెరిసింది. అమ్మడి తళుకులకు వెండి వెన్నెల సైతం ఎ:డల్లా మండిపోతుంది.. అంటూ ఈ ఫోటోలకు కుర్రకారు కళాత్మకంగా పోస్టులు పెడుతున్నారు.
నిజంగానే అంత కవితాత్మకంగానే వున్నాయ్ ఈ ఫోటోల్లో నభా నటేష్ పోజులు. అంతట వెన్నెలకే సెగలకు పుట్టిస్తోన్న నభా ఈ అందాలపై మీరూ ఓ లుక్కేస్కోండి మరి.
ఇదిలా వుంటే, దర్శకుడు పూరి జగన్నాథ్ ఈసారి ‘డబుల్ ఇస్మార్ట్’ అంటున్నాడు. రామ్ పోతినేని (Ram Pothineni) హీరోగా నభా నటేష్, నిధి అగర్వాల్ కలిసి నటించిన ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాకి ఇది సీక్వెల్.!
మరి, సీక్వెల్ కోసం నభా నటేష్ (Nabha Natesh) పేరుని దర్శకుడు పూరి జగన్నాథ్ (Director Puri Jagannadh) పరిశీలిస్తాడా.? వేచి చూడాల్సిందే.