Pawan Kalyan Varahi Declaration.. సనాతన ధర్మ పరిరక్షణ కోసం ఒకే ఒక్కడు నడుం బిగించాడు. అతనే జనసేన అధినేత, ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.
ఈ దేశంలో సనాతన ధర్మం గురించి మాట్లాడితే, ‘సెక్యులర్’కి వ్యతిరేకం.. అనే ఓ పనికిమాలిన భావనని బలవంతంగా రుద్దేశాయి కొన్ని అసాంఘీక శక్తులు.
నిజానికి, సనాతన ధర్మంలోనే పరమత సహనం కూడా వుంది.! లేకపోతే, సనాతన ధర్మాన్ని ఆచరించిన భారతావనిలోకి ఇతర మతాలు ఎలా వచ్చాయ్.? ఎలా మనుగడ సాధిస్తున్నాయ్.?
Pawan Kalyan Varahi Declaration.. వారాహి డిక్లరేషన్ ఇదీ..
జనసేన అధినేత, ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవేంకటేశ్వర స్వామి సాక్షిగా, తిరుపతిలో ‘వారాహి డిక్లరేషన్’ ప్రకటించారు.
దేశవ్యాప్తంగా చర్చనీయాంశమవుతున్న ఈ వారాహి డిక్లరేషన్‌లో కీలకమైన విషయాలివీ..
ఏ మతానికి, ఏ ధర్మానికి భంగం వాటిల్లినా ఒకేలా స్పందించే విధంగా లౌకిక వాదాన్ని పాటించాలి.
సనాతన ధర్మ పరిరక్షణ కోసం, ఆ విశ్వాసాలకు భంగం కలుగజేసే చర్యలు అరికట్టడానికి దేశం మొత్తం అమలు అయ్యేలా ఒక బలమైన చట్టం అవసరం ఉంది. దాన్ని తక్షణమే తీసుకురావాలి.

సనాతర ధర్మ పరిరక్షణ కోసం తీసుకువచ్చే చట్టాన్ని అమలు చేసేలా జాతీయ, రాష్ట్ర స్థాయిలో ‘సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు’ ఏర్పాటు కావాలి.
సనాతన ధర్మ పరిరక్షణ బోర్డుకు ప్రతి ఏటా నిధులు కేటాయించాలి.
సనాతన ధర్మాన్ని కించపరచి, ద్వేషం చిందించే వ్యక్తులకు, వ్యవస్థలకు సహాయ నిరాకరణ జరగాలి.
ఆలయాలలో నిత్యం జరిగే నైవేద్యాలు, ప్రసాదాలలో వినియోగించే వస్తువుల స్వచ్ఛతని ధృవీకరించే విధానాన్ని తీసుకురావాలి.
ఆలయాలు ఆధ్యాత్మిక కేంద్రాలుగా మాత్రమే కాదు, విద్యా కేంద్రాలుగా, కళా కేంద్రాలుగా, ఆర్థిక కేంద్రాలుగా, పర్యావరణ పరిరక్షణా కేంద్రాలుగా మరియు సంక్షేమ కేంద్రాలుగా కూడా పూర్తి స్థాయిలో రూపుదిద్దుకోవాలి. ఆ దిశగా ఒక ప్రణాళిక సిద్ధం చేయాలి.
Also Read: ఇంతకీ, ఇప్పుడు నాని ఏ ‘టైర్’ హీరో.?
వీటిల్లో ఏ ఒక్కటైనా అభ్యంతరకరమైన అంశం వుందా.? లేదు కదా.! అదే సనాతన ధర్మమంటే.!
సనాతన ధర్మాన్ని వైరస్‌తో పోల్చాడొక ఉన్మాది. పైగా, అతనేమో తనను తాను ‘సెక్యులర్’ అని చెప్పుకుంటుంటాడు.!
అయినా, అన్యమతస్తులకి సనాతన ధర్మం గురించి మాట్లాడే నైతిక హక్కు ఎక్కడుంది.?