Table of Contents
Nabha Natesh Retro Glamour.. రెట్రో కాన్సెప్టుల్లో వచ్చే సినిమాలకు ఈ మధ్య కాలంలో క్రేజ్ బాగుంది. ఆ మాటకొస్తే.. సీనియర్ హీరోలు సైతం రెట్రో స్టోరీలకే గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు.
అందుకు తగ్గట్లుగానే ముద్దుగుమ్మలు కూడా తెరపై తమని తాము రెట్రో లుక్స్‌లో చూసుకుని మురిసిపోతున్నారు.
రీసెంట్‌గా ‘ఛాంపియన్’ సినిమాలో అనస్వర రాజన్ ముద్దు ముద్దుగా చంద్రకళ పాత్ర కోసం రెట్రో లుక్‌లో చక్కగా ఒదిగిపోయిన సంగతి తెలిసిందే.
రెట్రో భామలు భలే ముద్దుగున్నారు.!
ఈ ముద్దుగుమ్మే కాదు.. మహానటి కీర్తి సురేష్ మొదలు, భాగ్యశ్రీ బోర్సే వరకూ పలువురు ముద్దుగుమ్మలు రెట్రో లుక్స్‌లో సందడి చేస్తున్నారు.
అలాగే నభా నటేష్ కూడా తనను తాను రెట్రో లుక్స్‌లో చూసుకోవాలనుకుంది కాబోలు. అందుకోసం ప్రత్యేకంగా ఫోటో షూట్ చేయించుకుంది.

తాజాగా ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయ్. ‘విరిసిన పూమాలలా పవళింపా ఇంతలా.!’ అనేలా ఆర్టిస్టిక్‌గా నభా నటేష్ పోజులు ఆకట్టుకుంటున్నాయ్.
ఏమాటకామాటే చెప్పుకోవాలి.. ఈ లుక్స్‌లో నభా నిజంగానే చాలా చాలా స్పెషల్‌గా కనిపిస్తోంది.
Nabha Natesh Retro Glamour.. కొంచెం ‘క్యూట్’ గా.. కొంచెం ‘హాట్’ గా..!
నభా.! ఇది నువ్వేనా.! అంటూ నభా నటేష్ క్యూట్ అండ్ హాట్ ఎక్స్‌ప్రెషన్స్‌కి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ‘నన్ను దోచుకుందువటే’ సినిమాతో హీరోయిన్‌గా క్యూట్ ఎంట్రీ ఇచ్చింది ముద్దుగుమ్మ నభా నటేష్.
ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించింది. కానీ, పూరీ జగన్నాధ్ డైరెక్షన్‌లో వచ్చిన ‘ఇస్మార్ట్ శంకర్’ నభానటేష్‌కి బ్రేక్ ఇచ్చింది.
ఆ తర్వాత స్టార్ హీరోయిన్ లిస్టులో చేరిపోతుందనుకున్నారంతా. కానీ, కుదరలేదు. కాస్త గ్యాప్ తీసుకుని ఇటీవల ప్రియదర్శి హీరోగా ‘డార్లింగ్’ మూవీతో రీ ఎంట్రీ ఇచ్చింది.
యాక్షన్ క్వీన్‌గా అదరగొట్టేనా.!
ఈ సినిమా ఆశించిన రిజల్ట్ అందుకోలేదనుకోండి. అది వేరే విషయం. ఇక త్వరలో నిఖిల్ సిద్దార్ధ్ హీరోగా ‘స్వయంభు’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
పీరియాడిక్ బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో నభా నటేష్ ఓ స్టన్నింగ్ రోల్ పోషిస్తోంది. అందుకోసం చాలా కష్టపడింది. గుర్రపు స్వారీ కూడా నేర్చుకుంది.
ఈ సినిమాలో హీరోతో పాటూ, కొన్ని యాక్షన్ ఘట్టాల్లోనూ నభా నటేష్ తన స్పెషల్ టాలెంట్ చూపించబోతోంది. ఏమో గుర్రం ఎగరా వచ్చు.! ఈ సినిమా హిట్ అయితే, నభా నటేష్ దశ తిరిగిపోనూ వచ్చు.! లెట్స్ వెయిట్ అండ్ సీ.!
