అబిజీత్ (Abijeet), అఖిల్ సార్దక్ (Akhil Sarthak), సోహెల్ (Syed Sohel Ryan) అలాగే మెహబూబ్ దిల్ సే (Mehaboob Dilse).. ఎవరూ తక్కువ కాదు.! ఈ సీజన్‌లో స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ అయి వుండీ, సంయమనం కోల్పోతున్నారు. మోనాల్ గజ్జర్ విషయంలో అబిజీత్, అఖిల్ సార్దక్ ఎందుకు ఓవరాక్షన్ చేస్తున్నారు.? (Nag Warning to Abijeet & Akhil) అన్నది ఎవరికీ అర్థం కావడంలేదు.
‘నా విషయంలో మీరెందుకు గొడవ పడతారు.? నన్ను మీ గొడవల్లోకి లాగొద్దు..’ అని పలుమార్లు మోనాల్ (Monal Gajjar) చెప్పాక కూడా, అబిజీత్ – అఖిల్ సార్థక్ ఇంకా ఆ విషయంలో లేనిపోని హంగామా చేయడం వల్ల ప్రయోజనం లేదు. పైగా, ఈ కారణంగానే ఇటు అబిజీత్, అటు అఖిల్.. ఇద్దరూ ఆడియన్స్ దృష్టిలో బ్యాడ్ అయిపోతున్నారు.
హౌస్‌లో ఏం జరుగుతోందో ఎవరికీ తెలియదు. అలాగే, బయట జనం ఏమనుకుంటున్నారో హౌస్‌లో వున్నోళ్ళకి తెలియదు. కానీ, గత సీజన్లను పూర్తిగా చదివేసి వుంటారు కదా.. మరెందుకు, ఈ ‘డర్టీ బిహేవియర్’.? అన్నదే ఎవరికీ అర్థం కాని ప్రశ్న. కింగ్ అక్కినేని నాగార్జున, హోస్ట్‌గా తన పని చేశాడు.. కొరడా ఝుళిపించాడు.
అఖిల్, అబిజీత్‌లకే కాదు.. సోహెల్, మెహబూబ్‌కి కూడా కొరడా దెబ్బలు పడ్డాయి.. రియల్‌గా కాదు లెండి.. కొరడా పట్టుకుని వార్నింగ్ ఇచ్చాడంతే హోస్ట్ నాగార్జున. సోహెల్‌కి కోపమొస్తే మనిషే కాడు.. ‘పిచ్చి కుక్కలా’ అని నాగ్ (King Akkineni Nagarjuna) అనాల్సి వచ్చిందంటే, సోహెల్ ఏ స్థాయిలో అర్థం పర్థం లేని ఆగ్రహావేశాలు ప్రదర్శిస్తున్నాడో అర్థం చేసుకోవచ్చు.
మెహబూబ్ కూడా అంతే. మంచి ఆటగాడు.. ఆటని పాడుచేసుకుంటున్నాడు అనవసరమైన ఓవరాక్షన్‌తో. చెప్పుకోవాలంటే హౌస్‌లో నలుగురూ స్ట్రాంగ్ కంటెస్టెంట్స్. ఆ మాటకొస్తే, ఈ సీజన్‌లో (Bigg Boss Telugu 4) దాదాపు అందరు కంటెస్టెంట్స్ చాలా స్ట్రాంగ్‌గా వున్నారు.
బిహేవియర్ విషయంలోనే కొందరికి మైనస్ మార్కులు ఎక్కువగా పడుతున్నాయి. ఆ లిస్ట్‌లో పై నలుగురూ (Nag Warning to Abijeet & Akhil) వుంటున్నారు. కాగా, కొరడా ఇంకాస్త గట్టిగా నాగ్ ఝుళిపించి వుంటే బావుండేదన్న అభిప్రాయం సర్వత్రా వినిపిస్తోంది. ఎందుకంటే, బిగ్ బాస్ (Bigg Boss 4 Telugu) వార్నింగుల్ని సైతం కంటెస్టెంట్స్ చాలా తేలిగ్గా తీసుకుంటున్నారు మరి.