Table of Contents
Nagachaitanya Sobhita Dhulipala Clarification.. ప్రేమించి పెళ్ళి చేసుకున్న అక్కినేని నాగచైతన్య, సమంత.. విడాకులు తీసుకోడానికి కారణమేంటి.?
శోభిత ధూళిపాళ్ళ కారణంగానే నాగచైతన్య, సమంత విడిపోయారా.? సమంత కాపురంలో శోభిత నిప్పులు పోసిందా.? మధ్యలోకి ‘మజిలీ’ ఫేం దివ్యాన్ష కౌశిక్ పేరు ఎందుకు వచ్చినట్లు.?
తన మీద వచ్చిన గాసిప్స్‌పై శోభిత ధూళిపాళ్ళ ఎలా స్పందించింది.? అనవసరమైన విషయాలకు తాను స్పందించనంటోంది ముద్దుగుమ్మ శోభిత ధూళిపాళ్ల. తనకు సంబంధం లేని విషయాలపై తనకు ఆసక్తి లేదంటోంది.
తన తప్పు లేకుండా పనీ పాటా లేని వాళ్లు ప్రచారం చేసే దుష్ప్రచారాలకు తాను సంజాయిషీ చెప్పుకోవల్సిన అవసరం లేదంటోంది శోభిత ధూళిపాళ్ల (Sobhita Dhulipala).
ఇంతకీ ఇంత ఘాటుగా ఈ ముద్దుగుమ్మ స్పందించడానికి కారణాలేంటో.! అనుకుంటున్నారా.? ఇటీవల సమంతతో తన విడాకుల విషయంపై చైతూ స్పందించిన సంగతి తెలిసిందే.
అప్పుడే స్పందించి వుండాల్సింది..
‘సమంత, నేనూ స్నేహ పూర్వకంగానే విడిపోయామనీ, ఈ విషయంలోకి సంబంధం లేని మూడో వ్యక్తిని బలవంతంగా లాగడం నన్ను హర్ట్ బాగా చేసింది..’ అని చైతూ వ్యాఖ్యానించారు.

చైతూ అలా స్పందించిన కొన్ని రోజులకే శోభిత ధూళిపాళ్ల ఇలా స్పందించడం ఆడియన్స్‌కి ఆశ్చర్యం కలిగిస్తోంది. సమంతతో విడాకుల అనంతరం చైతూ, శోభిత మధ్య ఏదో జరుగుతోందంటూ ప్రచారం జరుగుతోంది.
నిప్పు లేనిదే పొగరాంటారు.. ఈ రెస్పాన్స్ పొగ వచ్చిన వెంటనే వుంటే బాగుండేది. నిప్పు చల్లారిపోయాకా ఇప్పుడు సంబంధం లేదంటే ఎట్టా.?
Nagachaitanya Sobhita Dhulipala Clarification.. ఆ లిస్టు జర పెద్దదే సుమా.!
తనపై వస్తున్న ప్రచారాలన్నీ అసత్య ప్రచారాలే అంటోంది శోభితా ధూళిపాళ్ల. తన తప్పు లేకుండా జవాబు చెప్పాల్సిన అవసరం లేదంటోందీ తెలుగమ్మాయ్ శోభిత.
అలాగే, ఈ లింకుల లిస్టులో ‘మజిలీ’ ఫేమ్ దివ్యాంశ కౌశిక్ కూడా వుందండోయ్. చైతూ, సమంత లీడ్ రోల్స్‌లో వచ్చిన ‘మజిలీ’ సినిమాలో దివ్యాంశ కౌశిక్ (Divyansha Kushik) సెకండ్ హీరోయిన్‌గా నటించింది.

ఆ సినిమా స్టోరీనే వీళ్ల పర్సనల్ లైఫ్‌కి లింకు పెట్టేసి హాట్ హాట్‌గా కథనాలు వండి వడ్డించేశారు. అలాగే.. చై, సామ్ కాపురంలో చిచ్చు పెట్టిన వారిలో మరో వ్యక్తి హస్తం కూడా వుందంటారు.
టాలీవుడ్ నుంచి బాలీవుడ్ దాకా.!
ఆయనే సమంత పర్సనల్ మేకప్ అసిస్టెంట్ ప్రీతమ్ జుకాల్కర్. ఆయన కూడా నాకేం సంబంధం లేదు మొర్రో.. అని గతంలోనే సంజాయిషీ ఇచ్చుకున్నాడు.
Also Read: విజయ్ దేవరకొండ ‘The’పై అనసూయ అక్కసు.!
ఇంతేనా.! ఇలా చెప్పుకుంటూ పోతే, ఈ లిస్టు చాలా పెద్దదే. బాలీవుడ్ వరకూ పాకేసింది. బాలీవుడ్ మిస్టర్ పర్‌ఫెక్ట్ అమీర్ ఖాన్ (Amir Khan) పేరు కూడా ఈ లిస్టులో వుంది మరి.
ఏమనుకున్నారు.! టాలీవుడ్ సెన్సేషనల్ హాట్ టాపిక్స్‌లో చై సామ్ (Chay Sam) విడాకుల న్యూస్‌తో పోటీ పడిన మ్యాటర్ ఇంకోటి లేదంటే అతిశయోక్తి కాదేమో.