నటన అంటే అంత చులకనా.? అన్న ప్రశ్న చుట్టూ నాగార్జున ( Nagarjuna Bigg Boss ) చిన్న క్లాస్ తీసుకున్నాడు బిగ్‌బాస్ హౌస్ మేట్ శ్రీరామ్ చంద్రకి. అవును నటన అనేది చాలా కష్టమే. ఒకే సీన్ రెండు సీజన్లలో, వేర్వేరుగా కనిపించేలా నటించడం ఎంత కష్టమో కదా.
అయితే, నాగార్జున (Akkineni Nagarjuna) నటించడానికీ కష్టపడలేదు. కానీ, జనం నమ్మడానికే చాలా కష్టపడుతున్నారు. నాగార్జున మనల్ని నమ్మించాలనుకుంటున్నాడు. పోన్లే ఫీలవుతాడు.. ఈ సారికి నమ్మేద్దాం.. అనుకోవల్సిన దుస్థితి పట్టింది బీగ్‌బాస్ వీక్షకులుకి. ఎంత కష్టమొచ్చింది.? నాగార్జునకి. అలా కష్టపడుతున్నందుకే కదా.. నాగార్జునకు డబ్బులిచ్చేది.
తుస్సుమంటున్న సీక్రెట్..
గత సీజన్‌లో అఖిల్ సార్ధక్‌ని సీక్రెట్ రూమ్‌లోకి పంపారు. ఈ సీజన్‌లో లోబోని పంపారు. అంతకు ముందు రాహుల్ సిప్లిగంజ్ కూడా సీక్రెట్ రూమ్‌లోకి వెళ్లాడు. అరిగిపోయిన గ్రామ్‌ఫోన్ రికార్డుల పాట వినడానికి ఎంత కష్టంగా ఉంటుందో, ఈ సీక్రెట్ రూమ్ కోసం జరిగే ఎలిమినేషన్ కూడా అలాగే తగలడింది.
Also Read: ChaySam ‘మజిలీ’ ఎందుకు ముగిసింది.?
ఏం పర్‌ఫామెన్స్.? నాగార్జున, లోబో.. ఒకరితో ఒకరు పోటీ పడ్డారు. ఇదంతా చూస్తూ, ఆడియన్స్ కామెడీ చేసుకున్నారు. ఎందుకంటే, ఏం జరగబోతోందో బిగ్‌బాస్ వీక్షకులకి ముందే తెలిసిపోయింది.
ఎవరు కెప్టెన్ అవ్వబోతున్నారో, ఎవరు ఎలిమినేట్ అవ్వబోతున్నారో.. అన్నీ ముందే తెలిసిపోతున్నప్పుడు షోని రక్తి కట్టించేలా నడపడం ఎంత కష్టమో కదా. తన అనుభవాన్ని అంతా రంగరించి అక్కినేని నాగార్జున బిగ్‌బాస్ హోస్ట్‌గా పడరాని పాట్లు పడుతోంటే, దాన్ని జీర్ణించుకోవడం అభిమానులకి ఎంత కష్టమో కదా.
నాగార్జున మీద సింపతీ పెరుగుతోందా.? ఎందుకు నాగ్.. ఇదంతా నీకవసరమా.? అన్న భావన ఆడియన్స్‌లో పెరుగుతోందా.? రెండూ జరుగుతున్నాయ్. కానీ, నాగ్ ఇక్కడ ఏమీ చేయలేడు. బిగ్‌బాస్ రియాల్టీ షోలో నాగ్ పాత్ర చాలా పరిమితం. వీకెండ్‌లో వచ్చి స్ర్కిప్టు ప్రకారం యాక్టింగ్ చేసుకుని వెళ్లడం మాత్రమే నాగార్జున (Nagarjuna Bigg Boss) చేతిలో ఉంది. పాపం నాగ్.