మొదటి సీజన్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ (Young Tiger NTR) ఎనర్జీతో అదిరిపోయింది.. రెండో సీజన్ హోస్ట్ నాని (Natural Star Nani) కూడా బిగ్ బాస్ రియాాల్టీ షోని బాగానే నడిపించేశాడు. ఇప్పడు ముచ్చటగా మూడో సీజన్.. హోస్ట్ నాగార్జున (Akkineni Nagarjuna) ఏం చేయబోతున్నాడు? నాగ్ ఎంట్రీ అదిరిపోయింది. కానీ, ఫస్ట్ వీకెండ్ ఆయన చేయబోయే మ్యాజిక్ (Nagarjuna Bigg Boss 3 Test) కోసం బిగ్ బాస్ ఆడియన్స్ వెయిటింగిక్కడ..
వీకెండ్ వస్తోందంటే, బుల్లితెర ప్రేక్షకులకు ఇక నుండి పండగే పండగ. బుల్లితెరపై ప్రసారమవుతున్న బిగ్‌బాస్ రియాల్టీ షోలో (Bigg Boss 3 Telugu) వీకెండ్స్, నాగార్జున ఎంటర్‌టైన్‌మెంట్‌తో ఎంజాయ్ చేయనున్నారు బిగ్‌బాస్ ప్రేమికులు. తొలి సీజన్‌లో ఎన్టీఆర్ హోస్టింగ్‌లో వీకెండ్ ఎపిసోడ్స్ ఫుల్ జోష్‌గా ఉండేవి. తొలి సీజన్‌కి బిగ్ హౌస్‌లో (Bigg House) కంటెస్టెంట్స్ అంత హుషారుగా ఉండేవారు కాదు. సో వీక్ అంతా డల్‌గా నడిచేది. వీకెండ్స్‌లో ఎన్టీఆర్ వచ్చి, హౌస్‌మేట్స్‌తో సహా, ఆడియన్స్‌లోనూ కొత్త ఉత్సాహం నింపేవాడు. ఆ ఉత్సాహం వీక్‌లో మరో రెండు రోజుల వరకూ కొనసాగేది.
ఇక సెకండ్ సీజన్‌కొచ్చేసరికి నాని హోస్టింగ్‌లో ఎన్టీఆర్‌ని (Jr NTR) మ్యాచ్ చేయలేకపోయినా, హౌస్‌లో కంటెస్టెంట్స్ కొంత ఫర్వాలేదనిపించారు. అయినప్పటికీ, హౌస్‌లోని కొన్ని ఇష్యూస్ కాంట్రవర్సీగా ఉండడంతో, వీకెండ్స్‌లోనాని ఆ కాంట్రవర్సీలను ఎలా సాల్వ్ చేస్తాడనే ఇంట్రెస్ట్ ఆడియన్స్‌లో ఉండేది. మొత్తానికి ఏదో అలా రెండో సీజన్ నడిపించేశాడు నాని.
ఇక తాజా సీజన్ డే వన్ నుండే ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తోంది. ఫస్ట్‌డేనే సీక్రెట్ టాస్క్ ఇచ్చి, బిగ్‌బాస్ (Bigg Boss 3 Telugu) షాకిచ్చాడు. ఆ తర్వాత ప్రతీ రోజూ షో ఆసక్తికరంగా నడిచింది. ఏదో ఒక గొడవతో షోని రసరత్తరంగా నడిపిస్తున్నారు కంటెస్టెంట్స్. ఇక వీకెండ్‌లో ఆ ఇంపాక్ట్ అంతకు మించిన రేంజ్‌లో ఉండాలి.
నిజానికి టీవీ షోలు చేయడం నాగార్జునకు (King Nagarjuna)కొత్తేమీ కాదు. ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’తో అందరితోనూ నాగ్ బాగా ఇంటరాక్ట్ అయ్యాడు. ఆ షోలోనే బోలెడంత ఫన్ జనరేట్ చేశాడు. సో బిగ్‌బాస్ హోస్టింగ్‌లోనూ, వీకెండ్‌ని రక్తి కట్టించడంలో నాగ్ తన అనుభవాన్ని రంగరిస్తాడనడంలో సందేహం లేదు. అయినా కానీ, ఆడియన్స్‌లో కొన్ని అనుమానాలున్నాయి. ఆ అనుమానాలు ఈ వీకెండ్ షోతో పటాపంచలు కానున్నాయి.
మరోపక్క నాగార్జున నటించిన ‘మన్మధుడు 2’ (Manmadhudu2) రిలీజ్‌కి రెడీగా ఉంది. ఈ సందర్భంలో బిగ్‌బాస్ వేదికగా సినిమా గురించిన చర్చ కూడా రావచ్చు. సినిమాలో నటించిన ఆర్టిస్టుల గెస్ట్ అప్పియరెన్స్ కూడా ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. అయితే, ఇది నెక్ట్స్ వీక్ నుండి ఆశించాల్సి వుంటుందేమో. ఇక అన్నింటికంటే, ఫస్ట్ మోస్ట్ ఛాలెంజ్ హౌస్‌మేట్స్ కంప్లైంట్స్‌ని నాగ్ క్లియర్ చేయాల్సి ఉంది.
ఈ కంప్లైంట్స్ నేపథ్యంలో నాగ్ సూచించే సొల్యూషన్స్ 15 మంది కంటెస్టెంట్స్ తాలూకు ఆర్మీలని.. అదేనండీ, ప్యాన్స్‌ని సంతృప్తి పరిచేలా ఉండాలి. కానీ, హౌస్ మేట్స్‌లో కొందరికి చురకలు అంటించాల్సి ఉంటుంది. ఇంకొందరికి కాంప్లిమెంట్స్ ఇవ్వాల్సి ఉంటుంది. రెగ్యులర్ ఎపిసోడ్స్‌లో చూపించని సన్నివేశాలు కూడా నాగ్ చూసి, వాటి ప్రస్థావన వీకెండ్సలో వేదికపై తీసుకురావాల్సి ఉంటుంది.
ఏది ఏమైనా సదరు కంటెస్టెంట్స్ (Nagarjuna Bigg Boss 3 Test) ఆర్మీల నుండి వచ్చే వ్యతిరేకతను ముందే ఊహించి, అందుకు తగ్గట్లుగా నాగార్జున బిహేవియర్ ఉండాలి. హౌస్‌మేట్స్‌కే కాదు, నాగార్జునకి ఇదే అతి పెద్ద టాస్క్. ఆల్రెడీ ‘శ్రీముఖి మీద నెగిటివ్ కామెంట్స్ చేశావా..? జాగ్రత్త..! అంటూ శ్రీముఖి ఆర్మీ నుండి నాగార్జునకి హెచ్చరికలు జారీ అవుతున్నాయి సోషల్ మీడియా వేదికగా.
గతంలో ఇలాంటి ఇబ్బందులు నాని చాలా ఎదుర్కోవాల్సి వచ్చింది. అప్పుడు నానికి ‘దేవదాస్’ సినిమా రిలీజ్‌కి రెడీగా ఉండడంతో, ఈ ఇంపాక్ట్ సినిమాపై దుష్ప్రచారానికి కారణమైంది. ఇప్పుడు నాగ్‌దీ అదే పరిస్థితి. ఈ ఇంపాక్ట్ ‘మన్మధుడు 2’పై పడకుండా జాగ్రత్త పడాలి నాగార్జున.