Table of Contents
Nail Art.. ‘కాలి గోటికి కూడా సరిపోవ్..’ అంటూ ఎదుటి వారిని కించపరిచే విషయంలో చాలా తేలిగ్గా వాడేస్తుంటారు ఈ మాట.
ఏం ‘గోరు’ అంటే అంత తేలికా.? అస్సలు కానే కాదు. గోరు హిస్టరీ గురించి తెలిస్తే షాక్ అవ్వాల్సిందే. ‘గోరు’ హిస్టరీ ఇప్పటిది కానే కాదు.
అప్పట్లోనే రాణులు తమ గోళ్లను అందంగా అలంకరించుకోవడానికి ఎన్నో కసరత్తులు చేసేవారు. ఇప్పుడు గోళ్లకు అందం తెచ్చేందుకు నెయిల్ పెయింట్ లేదా నెయిల్ పాలిష్ అంటున్నాం కదా. అప్పట్లోనూ ఈ తరహా గోళ్ల రంగులుండేవి.
Nail Art .. అప్పట్లో గోరు ‘కళ’ అలా..
అయితే, అప్పట్లో నేచురల్ రంగులతో తయారు చేసిన గోళ్ల రంగులు అందుబాటులో వుండేది. ఇప్పుడవే.. ఫ్యాషన్ పేరుతో కెమికల్ మిక్స్ నెయిల్ పాలిష్‌లుగా రూపొంతరం చెందేశాయి.
సరే, ‘గోరు’ గత హిస్టరీ సంగతి అలా వుంచితే, ‘గోరు’ అంటే అంత ఆషా మాషీ అయితే మాత్రం కాదండోయ్. అందుకేనేమో, ‘నఖ శిఖ పర్యంతం’ అని పెద్దలు ఊరకే అనలేదు. అంతటి ప్రాధాన్యత వుంది గోరుకి మరి.
గ్లామర్ ప్రపంచంలో గోటికి వున్న ‘రేంజ్’ తెలిస్తే షాక్వాల్సిందే.
‘నెయిల్ ఆర్ట్’.. ఈ మధ్య చాలా ఎక్కువగా వినిపిస్తున్న మాట ఇది. వేలాది మందికి, లక్షలాది మందికి ఈ నెయిల్ ఆర్ట్ తిండి పెడుతోందంటే, నమ్ముతారా.? నమ్మి తీరాల్సిందే.

కోట్లు, వందల కోట్లు, వేల కోట్లలో టర్నోవర్ కేవలం గోరు గ్లామర్ చుట్టూ జరుగుతోందంటే, నమ్మడం కష్టం. ప్రత్యేకంగా గోరు మీద పెయింటింగ్ ద్వారానే అది సాధ్యమవుతోంది. అది కాలి గోరు కావచ్చు. చేతి గోరు కావచ్చు.
వేలికే కాదు, గోటికీ ఆభరణం పెట్టొచ్చు..
బాలీవుడ్ భామ జాక్వెలిన్ ఫెర్నాండెజ్.. గోళ్లు ప్రస్తుతం ట్రెండింగ్ అయ్యాయ్. ఎందుకంటే, ఆమె నెయిల్ పెయింట్‌తో పాటు, ఆ గోటి భాగంలో ఓ ఆభరణాన్ని కూడా ధరించేసింది. అందుకే ఆ పిక్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయ్.
ధగ ధగలాడే నెయిల్ పాలిష్‌తో పాటు, వుంగరం లాంటి ఓ ఆభరణాన్ని సైతం గోటికి అలంకరించి అందంగా ఫోటోలకు పోజిచ్చింది శ్రీలంక భామ జాక్వెలీన్.
Also Read: అమ్మాయిపై రూమర్.! అయితే నిజమే.! కానీ.?
మరో బాలీవుడ్ భామ అయితే, ఏకంగా నెయిల్ ఆర్ట్ మీద ఓ పెద్ద బిజినెస్నే స్టార్ట్ చేసింది. ఆమె ఎవరో కాదు, సోనాక్షి సిన్హా. రీసెంట్‌గా తన గోరు బిజినెస్ ముచ్చటని గర్వంగా సోనాక్షి సిన్హా సోషల్ మీడియా ద్వారా ప్రకటించింది.
ఏమనుకున్నారు మరి.. అదీ గోటికున్న గ్లామర్ కథ.