Nalugo Pellam.. రాజకీయాల్లో విమర్శలు సహజం.! చెప్పీ.. చెప్పీ.. వినీ.. వినీ.. రాసీ.. రాసీ.. బోర్ కొట్టేస్తోంది ఈ మాట.! అయినా, తప్పడం లేదు.!
అయినా, రాజకీయం అంటే విమర్శ మాత్రమేనా.? అసలు విమర్శ అంటే ఏంటి.? విమర్శ అంటే, బూతు.. అని నమ్ముతున్నారు చాలామంది రాజకీయ నాయకులు.!
ఓ మహిళా నేత ఓ పోలీస్ అధికారిని ఉద్దేశించి, ‘లంజా కొడుకులు’ అంటూ నడి రోడ్డు మీద బండ బూతులు తిట్టడం చెవులారా విన్నాం.. కళ్ళారా చూశాం.! ఆమె ఓ ప్రజా ప్రతినిథి.
ఆకాశంలో సగం.. బూతుల్లో కూడా సగం.! ఔనూ, ‘లంజా కొడుకులు’ అన్న మాటని ఎందుకు మనం ఇక్కడ సెన్సార్ చేయలేదు.?
Nalugo Pellam.. ఎలా సెన్సార్ చేయగలం.?
అబ్బే, సెన్సార్ చేసి ప్రయోజనం లేదు. సిగ్గు లేకుండా బూతులు మాట్లాడేస్తున్నారు చాలామంది రాజకీయ నాయకులు. పైగా, ‘గ్రామీణ భాష’ అనే పద్ధతైన పేరు పెట్టారు సిగ్గు లేకుండా బూతు భాషకి.!
మీరు ఎన్ని బూతులు మాట్లాడగలరు.? అనే టెస్ట్ పెట్టి మరీ, రాజకీయ పార్టీలు ‘నాయకుల్ని’ ఎంచుకుంటున్నాయేమో.!

అసలు విషయానికొస్తే, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విసుగెత్తిపోయారు. ‘నలుగురు నలుగురు భార్యలు..’ అంటూ వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అంతలా జుగుప్సాకరమైన వ్యాఖ్యలతో విసిగించేస్తున్నారు మరి.!
అందుకే, ‘నాకైతే మూడు సార్లు పెళ్ళయ్యింది. రెండు సార్లు విడాకులు జరిగాయి. మరి, నాలుగో పెళ్ళాం ఎక్కడ.? నువ్వేనా నాలుగో పెళ్ళాం జగన్.? నాలుగో పెళ్ళానివే అయితే రా..’ అంటూ జనసేనాని తాజాగా వ్యాఖ్యానించారు.
తప్పేగానీ.. తప్పలేదేమో.!
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద జనసేన అధినేత పవన్ కళ్యాణ్, ‘నాలుగో పెళ్ళాం’ అనడం సబబు కాదు.!
కానీ, కుక్క కాటుకి చెప్పు దెబ్బ.. అనే సామెత వుంది కదా.. దాన్ని పవన్ కళ్యాణ్ పాటించారు గనుక, తప్పు కాదు.!

ముఖ్యమంత్రి ఎప్పుడూ తన స్థాయిని మర్చిపోకూడదు. మర్చిపోతే, ఇదిగో ఇలాగే వుంటుంది.! ‘నాలుగో పెళ్ళాం’ కామెంట్ మీద వైఎస్ జగన్ గనుక స్పందిస్తే, ఆ తర్వాత పవన్ కళ్యాణ్ ర్యాగింగ్ వేరే లెవల్‌లో వుంటుంది.!
Also Read: బాబు ఇచ్చాడా? జగన్ ఇస్తున్నాడా? నిజమెవరైనా చెప్పగలరా?
అన్నట్టు, ‘నా ఇంట్లో ఆడవాళ్ళ మీద పెళ్ళాలంటూ మీ ఆయన మాట్లాడుతున్నారు. మీ గురించి మేం అంటే బాగోదు మేడమ్ భారతిగారూ..’ అంటూ వైఎస్ జగన్ సతీమణికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సూచన లాంటి స్వీట్ వార్నింగ్ ఇచ్చేశారండోయ్.!