Thalapathy Vijay Beast.. తమిళ హీరో విజయ్ మీడియా ముందుకొచ్చి పదేళ్లయ్యిందట. నిజమేనా.? అయ్యే వుంటుందిలెండి.
విజయ్ ఇంటర్వ్యూలు ఎక్కడా అందుబాటులో లేవంటే, ఆయన మీడియాకి దూరంగా వున్నట్లే లెక్క.
ఇంటర్వ్యూల పరంగా మాత్రమేనండోయ్. కానీ, ఎందుకు ఇంటర్వ్యూలంటే విజయ్ ఇన్నేళ్లూ భయపడ్డాడు.? ‘బీస్ట్’ (Beast Movie) విజయ్ దృష్టిలో మీడియా విలన్ అయ్యింది ఎందుకు.?
దీనికో చిన్నకుంటిసాకు చెప్పాడు తమిళ హీరో విజయ్. అప్పుడెప్పుడో పదేళ్ల క్రితం ఓ ఇంటర్వ్యూలో ఆయన ఏదో చెప్పాడట. మీడియాలో ఇంకోటేదో వచ్చిందట.
ఆ ఇంటర్వ్యూని తానే చూసుకుని ఆశ్చర్యపోయాడట విజయ్. చెప్పింది ఒకటి, ప్రచారం చేసేది ఇంకొకటి.. మీడియా ఎలా వక్రీకరిస్తుందో, అప్పుడే అర్ధమైందట విజయ్‌కి.
Thalapathy Vijay Beast.. ఇంటర్వ్యూలు.. తుంటర్వ్యూలైపోయాయ్ మరి.!
వామ్మో.! ఇంతకన్నా కామెడీ ఇంకేదైనా వుంటుందా.? మీడియా సాయం లేకుండా విజయ్ సినిమాలు ఇంతలా పబ్లిసిటీ పరంగా క్లిక్ అయ్యేవా.? ఛాన్సే లేదు.
తన సినిమాల్ని మీడియా ద్వారానే విజయ్ ప్రమోట్ చేసుకుంటాడు. ఎవరైనా చేసేది అదే. అక్కడికేదో మీడియాని విలన్‌గా చూపించడం వల్ల విజయ్‌కి వచ్చే లాభమేంటో మరి.?
ప్రతిసారీ ఏదో కొత్తగా చెప్పాలని సెలబ్రిటీలు తహతహలాడడం, మీడియా కూడా కొత్తగా ఏదైనా రాబట్టేయాలని ప్రయత్నించడం ఈ క్రమంలోనే ఇలాంటి చిత్ర విచిత్రాలు జరుగుతుంటాయ్.
Also Read: ‘ఆర్ఆర్ఆర్’పై అంతలా కక్ష పెంచుకున్నారెందుకు.?
మీడియాని విజయ్ ఇంటర్వ్యూల పరంగా దూరం పెట్టిన వైనం, అందర్నీ విస్మయానికి గురి చేస్తోంది. చాలా మంది విజయ్ తీరుని తప్పు పడుతున్నారు. కొంతమంది ఆయన్ని సమర్ధిస్తున్నారు.
ఎవరి గోల వారిది. రాజకీయాల్లోకి వచ్చేందుకు ఆసక్తితో వున్న విజయ్ (Thalapathy Vijay) అడపా దడపా మీడియాకి లీకులిప్పిస్తుంటాడు. మళ్లీ తానే ఆ లీకు వార్తల్ని ఖండిస్తుంటాడు.
విజయ్ రూటే సెపరేటు.!