Nandamuri Balakrishna Nurse.. అయ్యో ఫాపం బాలయ్య.! ఇంకోసారి అడ్డంగా బుక్కయిపోయాడయ్యా.!
నందమూరి బాలకృష్ణ బ్యాక్ టు బ్యాక్ వివాదాలు ఎదుర్కొంటున్నారు. మొన్నటికి మొన్న ‘వీర సింహా రెడ్డి’ విజయోత్సవంలో ‘అక్కినేని.. తొక్కినేని..’ అంటూ చేసిన వ్యాఖ్యలతో పెను దుమారం చెలరేగిన సంగతి తెలిసిందే.
ఎలాగో ఆ వివాదం సద్దుమణిగింది. ఇంతలోనే, ఇంకో వివాదం తెరపైకొచ్చింది.
నర్సుల మీద ఏంటి బాలయ్యా.?
అప్పుడెప్పుడో బాలకృష్ణకు రోడ్డు ప్రమాదం జరిగిందట. ఆనాటి విషయాల్ని గుర్తు చేసుకుంటే, ‘ఆసుపత్రిలో నర్సు’ గురించి అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారాయన.
పవన్ కళ్యాణ్‌తో ముచ్చటిస్తూ, క్యాజువల్‌గా బాలయ్య చేసిన ఆ వ్యాఖ్య.. పెద్ద దుమారానికే కారణమయ్యింది. నర్సుల్ని కించపరుస్తారా.? అంటూ తెలుగు రాష్ట్రాల్లో పలువురు ఆందోళనలు చేశారు.
ఈ క్రమంలో నందమూరి బాలకృష్ణ దిగొచ్చారు. తాను బసవతారకం ఆసుపత్రి ఛైర్మన్‌గా వున్నాననీ, నర్సుల ప్రాముఖ్యత తెలుసని అన్నారు బాలయ్య.
Also Read: పవన్ కళ్యాణ్ బ్రహ్మచర్యం.! జాతీయ సమస్యే.?
నర్సుల గొప్పతనాన్ని అర్థం చేసుకోగలనని.. చెబుతూ, తన వ్యాఖ్యలు వక్రీకరణకు గురయ్యాయని చెప్పుకొచ్చారు.
ఎవరైనా బాధపడి వుంటే క్షమించమని కోరుతున్నట్లు కూడా బాలయ్య పేర్కొన్నారు.
అయితే, నిజానికి.. ఈ మాట వివాదాస్పదమవుతుందని ముందే ఊహించి ‘ఆహా’ టీమ్.. దానికి కత్తెర వేసి వుండాలి. నిర్వాహకుల నిర్లక్ష్యమే.. బాలయ్య కొంప ముంచింది.