Table of Contents
సినీ నటుడు, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణని (Nandamuri Balakrishna) కొంతమంది ‘చిన్న పిల్లాడి’తో పోల్చుతుంటారు. కానీ, ఆయన చాలా చాలా పెద్ద మాటలు మాట్లాడుతుంటారు.
‘మా బ్లడ్డు వేరు.. మా బ్రీడు వేరు..’ అనే స్థాయిలో బాలయ్య సినిమాటిక్ డైలాగులు చెప్పడం కొత్తేమీ కాదు. అవి అ
అభిమానుల్ని ఓ రేంజ్‌లో అలరిస్తుంటాయ్.
Nandamuri Balakrishna బాలయ్యకి కోపమొచ్చింది..
మార్చెయ్యటానికీ తీసెయ్యటానికి NTR అన్నది పేరుకాదు..
ఓ సంస్కృతి.. ఓ నాగరికత.. తెలుగుజాతి వెన్నెముక..
తండ్రి గద్దెనెక్కి ఎయిర్ పోర్ట్ పేరు మార్చాడు..
కొడుకు గద్దెనెక్కి యూనివర్సిటీ పేరు మారుస్తున్నాడు.. మిమ్మల్ని మార్చటానికి ప్రజలున్నారు…… పంచభూతాలున్నాయ్ తస్మాత్ జాగ్రత్త…….

అక్కడ ఆ మహనీయుడు పెట్టిన భిక్షతో బతుకుతున్న నేతలున్నారు.. పీతలున్నారు.. విశ్వాసంలేని వాళ్లని చూసి కుక్కలు వెక్కిరిస్తున్నాయ్..
శునకాలముందు తలవంచుకు బతికే సిగ్గులేని బతుకులు..
ఇలా స్పందించారు నందమూరి బాలకృష్ణ, తన తండ్రి స్వర్గీయ ఎన్టీయార్ పేరుని హెల్త్ యూనివర్సిటీ నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తొలగించేందుకు నిర్ణయం తీసుకోవడంపై.
పేరు మారితే ఏమవుతుంది.?
పేరు మార్పు ఎంతవరకు సబబు.? అన్నది వేరే చర్చ. రాజకీయాల్లో ఇలాంటివన్నీ సర్వసాధారణమైపోయాయి. టీడీపీ అధికారంలోకి వచ్చాక, అనేక సంక్షేమ పథకాలకి పేర్లు మారిపోయాయ్.
Also Read: LIGER OTT Review.! బాబోయ్ ఎందుకింత హర్రర్.!
వైఎస్ జగన్ హయాంలోనూ అలాగే పేర్లు మారిపోతున్నాయ్. అయితే, హెల్త్ యూనివర్సిటీకి పేరు మార్చడం సబబు కాదన్న విమర్శలు వినిపిస్తున్నాయనుకోండి.. అది వేరే విషయం.
పాపం.. అప్పుడు ఎన్టీయార్ ఒంటరి.!
అయితే, స్వర్గీయ ఎన్టీయార్ జీవించి వుండగానే, ఆయన్ని తీవ్ర మానసిక క్షోభకు గురిచేశారు ప్రస్తుత టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు.
చివరి రోజుల్లో చంద్రబాబు మీద ఎన్టీయార్ తీవ్రమైన విమర్శలు చేశారు.. కంటతడి పెట్టారు.. అప్పట్లో ఆ తండ్రి ఆవేదనను ఎవరూ అర్థం చేసుకోలేకపోయారు.
ఇప్పుడేమో, ఆ మహనీయుడి గొప్పతనం గురించి నందమూరి బాలకృష్ణ చెబుతున్నారు. ఇదే అసలు సమస్య. అప్పుడు ఒకలా, ఇప్పుడు ఇంకోలా.! ఇదేనా ‘మా బ్లడ్డు వేరు.. మా బ్రీడు వేరు..’ అంటే.!
చివరగా.. కేవలం ఓ రాజకీయ నాయకుడిగానే నందమూరి బాలకృష్ణ ఇలా స్పందిస్తే, ఆయన స్పందనను తప్పు పట్టలేం. ఎందుకంటే, రాజకీయ నాయకులంటేనే గురివింద గింజలన్నట్టు.!