Nandamuri Balakrishna.. బాలయ్య ఏం చెప్పినా, అభిమానులకు అది ఓ రేంజ్లో ‘కిక్’ ఇస్తుంది.! బాలయ్య డైలాగులు.. బాలయ్య ఫైట్లు.. బాలయ్య డాన్సులు.! బాలయ్య రూటే సెపరేటు.!
మరి, బాలయ్య చుట్ట సంగతేంది? ఇంతకీ, ఈ ‘చుట్ట’ ఏంటి.? అదేనండీ పొగాకు చుట్ట.! పొగాకు ఆరోగ్యానికి హానికరం కదా.?
మెజార్టీ క్యాన్సర్ల పొగాకు వల్లనే వస్తున్నాయ్. బసవతారకం ఆసుపత్రి ఛైర్మన్‌గా వ్యవహరిస్తున్న బాలకృష్ణకి ఆ సంగతి తెలియదా.? తెలిసీ, ‘పొగాకు చుట్టల్ని’ ప్రమోట్ చేయడమేంటి.?
Nandamuri Balakrishna.. సిగరెట్లతోనే ప్రమాదమట.. చుట్టలతో కాదు అట.!
సిగరెట్ అయితే.. పొగని లోపలికి పీల్చేస్తాం. కానీ, పొగాచు చుట్ట కాల్చినప్పుడు అలా జరగదని బాలయ్య అంటున్నాడు.
లోపలికి వెళ్ళకుండానే లంగ్స్ నుంచి శ్లేషం బయటకు తీసేస్తుందట.. ఆ పొగ.! ఇదెలా సాధ్యం.. అనడక్కండి.. బాలయ్య అంతే.! ఆయన రూటూ అంతే.!
పొగాకు.. పైగా లంక పొగాకు.. ఉదయాన్నే మూడున్నరకు లేచి, లంక పొగాకుతో తయారు చేసిన చుట్ట కాల్చడం అలవాటు అట బాలయ్యకి.!
దర్శకుడు గోపీచంద్ మలినేని కూడా ఈ పొగాకు కథ శ్రద్ధగా వినేసి, తాను చెప్పాలనుకున్న నాలుగు ముక్కల్నీ చెప్పేశాడు.. అదీ పొగాకుకి సంబంధించే.
వీర సింహా రెడ్డి పొగాకు చుట్ట..
సినిమాలో సన్నివేశాల కోసం అవసరమవుతుందేమోనని, షూటింగ్ స్పాట్‌కి లంక పొగాకు చుట్టల్ని బాలకృష్ణ తీసుకెళ్ళారట కూడా.!
సరిపోయింది సంబరం.! బాలయ్య ఏం చెప్పినా అద్భుతమే. ఇంకెందుకు.. పొగాకు ఆరోగ్యానికి హానికరం.. అన్న బోర్డు తీసెయ్యండిక.!