వకీల్ సాబ్ ప్రివ్యూ: పవన్ కళ్యాణ్ బాక్సాఫీస్ స్టామినా ఎంత.!

Pawan Kalyan Vakeel Saab Review
పవన్ కళ్యాణ్.. ఈ పేరు చెబితే, లక్షలాదిమంది ‘పవనిజం’ అనే ఓ ప్రత్యేకమైన అనుభూతికి లోనవుతారు. తెరపై తమ అభిమాన నటుడి నటనకు ఫిదా అవడమే కాదు, తమ అభిమాన హీరో వ్యక్తిత్వాన్ని (Pawan Kalyan Vakeel Saab Review) మరింతగా అభిమానులు ఆరాధిస్తుంటారు.
‘ఇక ప్రజా సేవకే ఈ జీవితం అంకితం.. ఇకపై సినిమాలు చేయను..’ అని జనసేన పార్టీ అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చెప్పడంతో నిరాశపడ్డ అభిమానులు, ‘వకీల్ సాబ్’ సినిమా ప్రకటన రాగానే.. కొత్త ఉత్సాహాన్ని సంతరించుకున్నారు.. ఆ ‘వకీల్ సాబ్’ ప్రేక్షకుల ముందుకొచ్చేస్తోందంటే.. అభిమానుల ఆనందానికి ఆకాశమే హద్దు కదా మరి.!
పింక్ నుంచి వకీల్ సాబ్.. వయా నేర్కొండ పార్వాయ్
‘వకీల్ సాబ్’ (Vakeel Saab Review) సినిమాకి పవన్ కళ్యాణ్ ఒప్పుకోవడానికి చాలా పెద్ద కథే నడిచింది. బాలీవుడ్ సినిమా ‘పింక్’, తమిళంలోకి ‘నేర్కొండ పార్వాయ్’ పేరుతో రీమేక్ అయ్యింది. హిందీలో అమితాబ్ పోషించిన పాత్రని తమిళంలో అజిత్ పోషించాడు.
తమిళ వెర్షన్ కోసం కొన్ని కమర్షియల్ మార్పులు చేయాల్సి వచ్చింది. అవి వర్కవుట్ అయ్యాయి కూడా. తెలుగులోకి వచ్చేసరికి మరిన్ని కమర్షియల్ మార్పులు చేసినట్లు తెలుస్తోంది.
హిందీ ‘పింక్’, తెలుగు ‘వకీల్ సాబ్’కి తేడా అదే..
‘పింక్’ (Pink Movie) సినిమాలో అమితాబ్ బచ్చన్ (Amitabh Bachhan), వృద్ధుడిగా కనిపిస్తాడు. ఆయన వయసుకు తగ్గ పాత్ర అది. తమిళంలో మధ్య వయస్కుడిగా అజిత్ (Thala Ajith Kumar) కనిపించినా, జుట్టు మాత్రం తెల్లగానే వుంచారు. ఆ లుక్ అజిత్ స్పెషల్ స్టైల్.
తెలుగు వెర్షన్ విషయంలో మాత్రం, పవన్ కళ్యాణ్.. ఒకింత యంగ్ లుక్ ప్రదర్శిస్తున్నట్లే కనిపిస్తోంది. తమిళ వెర్షన్ కంటే కూడా హీరో పాత్రలోని పవర్ పరంగా తెలుగు వెర్షన్ చాలా కొత్తగా వుండబోతోందన్నది అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం.
పాటలు పెరిగాయ్ గానీ..
హిందీ, తమిళ వెర్షన్లతో పోల్చితే, తెలుగు వెర్షన్ (Pawan Kalyan Vakeel Saab Review) విషయానికొచ్చినప్పుడు పాటలు కాస్త ఎక్కువగానే వున్నాయి. అలాగని, ఏ పాట కూడా సందర్భోచితం కాదు.. అనే ప్రశ్న రాకుండా అత్యంత జాగ్రత్తగా సిట్యుయేషనల్ పాటల్నే తీర్చిదిద్దారు.
దర్శకుడు, సంగీత దర్శకుడు, నిర్మాత.. అందరూ పవన్ అభిమానులే..
దర్శకుడు వేణు శ్రీరామ్ (Venu Sri Ram) , సంగీత దర్శకుడు తమన్ (SS Thaman) మాత్రమే కాదు, ప్రముఖ నిర్మాత దిల్ రాజు (Dil Raju) కూడా, తాను పవన్ కళ్యాణ్ అభిమానని చెప్పుకున్నారు. చెప్పుకోవడమే కాదు, పవన్ మీద తనకున్న అభిమానాన్ని ఇటీవల జరిగిన సినిమా ఫంక్షన్ సాక్షిగా ఉద్వేగంగా బయటపెట్టారు.
కమర్షియల్ సక్సెస్.. అంతకు మించి..
ఇలాంటి సినిమాల్ని కమర్షియల్ కోణంలో చూడలేం. కానీ, పవన్ కళ్యాణ్ సినిమా కదా.. బాక్సాఫీస్ లెక్కలు ఖచ్చితంగా వుంటాయ్. 100 కోట్లు అనేది ఈ రోజుల్లో పెద్ద బెంచ్ మార్కు కాదు పవన్ స్టామినాని లెక్కల్లో తీసుకుంటే.
కానీ, కరోనా కాస్త భయపెడుతోంది. కరోనా భయాలు లేకపోతే.. సినిమా రిజల్ట్ (Pawan Kalyan Vakeel Saab Review) ఎలా వున్నా, ‘వకీల్ సాబ్’ సరికొత్త చరిత్ర రాయబోతోందన్నమాట తెలుగు సినీ పరిశ్రమలో.
