Nani Hi Nanna Movie.. ‘సీతారామం’ సినిమా అంత పెద్ద విజయం సాధించిందంటే, ఆ సినిమాలో నటీనటులూ అంత సహజంగా నటించారు మరి.! ప్చ్.. నటించడం కాదు, జీవించేశారు.
తెలుగులో తొలి సినిమాతోనే నటిగా తానేంటో నిరూపించుకుంది అందాల భామ మృనాల్ ఠాకూర్. ఆ సినిమాలో ఆమె నటనకు ప్రత్యేక ప్రశంసలు దక్కాయ్.
నేచురల్ స్టార్ నాని నటనా ప్రతిభ గురించి కొత్తగా చెప్పేదేముంది.? సహజమైన నటనకు కేరాఫ్ అడ్రస్ నాని. ఏ సినిమాలోనూ నాని నటిస్తున్నట్లుండదు, ఆయా పాత్రల్లో అంతలా ఒదిగిపోతాడు.
Nani Hi Nanna Movie.. హాయ్ నాన్న.. ఏం సహజత్వమిది.!
‘హాయ్ నాన్న’ విడుదలకు సిద్ధమైంది. నాని (Natural Star Nani), మృనాల్ ఠాకూర్ (Mrunal Thakur) జంటగా నటించారు ఈ సినిమాలో.
ఓ చిన్నారి చుట్టూ నడిచే కథ ఇది.! ఆ చిన్నారి సహా, నాని (Natural Star Nani) అలాగే మృనాల్.. ఈ సినిమాకి ప్రాణం పోసేసినట్లు కనిపిస్తోంది. ట్రైలర్ అంత బాగా కట్ చేశారు.
ట్రైలర్ పూర్తయ్యేసరికి, కళ్ళు చెమర్చకుండా వుండదు చూసేవాళ్ళకి.! సరదాగా ప్రారంభమై, ఎమోషనల్ టచ్‌తో ముగుస్తుంది ట్రైలర్.
సినిమాలో లొకేషన్స్ చాలా బాగా చూపించినట్లు అర్థమవుతోంది.
మృనాల్ – నాని పోటా పోటీ..
అటు నాని, ఇటు మృనాల్ ఠాకూర్.. ఇద్దరూ పోటాపోటీగా ఈ సినిమాలో నటించినట్లే కనిపిస్తోంది. నాని నటనని మ్యాచ్ చేయడమంటే అంత తేలిక కాదు.!
కానీ, మృనాల్ కూడా నానికి సవాల్ విసిరినట్లే వుంది.! బలమైన పాత్రలు, బరువైన సన్నివేశాలు.. వెరసి, ‘హాయ్ నాన్న’ మంచి విజయాన్ని అందుకునే అవకాశం వుంది.
Also Read: డీప్ ఫేక్.! జారా పటేల్ శరీరం.. రష్మిక మండన్న తలకాయ్.!
సినిమాటోగ్రఫీ, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్.. దేనికదే సమ్‌థింగ్ వెరీ స్పెషల్ అన్నట్లున్నాయ్. సినిమా చాలా రిచ్‌గా కనిపిస్తోంది. అంత బాగా ట్రైలర్‌ని కట్ చేశారు.
ఎలా చూసినా నాని (Natural Star Nani) కెరీర్‌లోనే వెరీ వెరీ స్పెషల్ ఫిలిం కానుంది ‘హాయ్ నాన్న’ అనే భావన ట్రైలర్‌తో వచ్చేలా చేయగలిగారు.