Nani Hit3 Kill Marco.. ఔను, నాని ‘పక్కింటి కుర్రాడి’లా చాలా బావుంటాడు. నేల విడిచి సాము చేసి, కొన్నిసార్లు ఫెయిల్యూర్స్ చవి చూశాడుగానీ, నటుడిగా.. అన్నీ ప్రయత్నించాలి కదా.!
తాజాగా ‘హిట్-3’ అంటూ ప్రేక్షకుల ముందుకొచ్చేందుకు సమాయత్తమవుతున్నాడు హీరో నాని. నాని పుట్టినరోజు సందర్భంగా ‘హిట్-3’ నుంచి ఓ టీజర్ వదిలారు మేకర్స్.!
టీజర్ చూస్తున్నంత సేపూ, ‘అరాచకమే’ కనిపించింది.! అరాచకం.. అంటే, ముందుగా గుర్తుకొచ్చేది బాలీవుడ్ సినిమా ‘కిల్’.! రక్త సిక్తం.. బాబోయ్.. అదేం యాక్షన్.! ఔను, అది నిజమే.
Nani Hit3 Kill Marco.. వెండితెరపై.. సరికొత్త రక్తచరిత్ర.!
‘కిల్’ కంటే దారుణమైన సినిమా ‘మార్కో’. ఉన్ని ముకుందన్ నటించిన ఈ సినిమా, వివిధ భాషల్లో సంచలన విజయాన్ని అందుకుంది.
ప్రేక్షకుల అభిరుచి మారిందా.? అంటే, ఔననే చెప్పాలేమో. ఓటీటీ పుణ్యమా అని, స్క్రీన్ రక్తసిక్తం అయితే చూడాలనుకునే ఓ వర్గం ప్రేక్షకుల సంఖ్య క్రమంగా పెరుగుతూ వస్తోంది.
‘హిట్-3’ కూడా ఆ కోవలోకే వస్తుందేమో.! అదేం నరుకుడు బాబోయ్.. అనేంతలా, టీజర్‌ని ముగించారు.! నాని నుంచి ఇంతటి రక్తపాతాన్ని ప్రేక్షకులు జీర్ణించుకోలేరా.?
రక్తపాతం.. అంతకు మించి.!
ఏం, ఎందుకు జీర్ణించుకోలేరు.? ‘దసరా’ సినిమా చూశాం కదా.! నిజమే, ‘దసరా’ సినిమాలోనూ రక్తపాతమే.! భయంకరమైన రక్తపాతం. ‘హిట్-3’లో అంతకు మించి.!

‘హిట్’ సిరీస్‌లో ఇప్పటిదాకా వచ్చిన రెండు సినిమాలూ మంచి విజయాల్నే అందుకున్నాయ్.! ఈ ‘హిట్-3’ సినిమాకి కూడా హిట్టు కళ బాగానే కనిపిస్తోంది.!
నాని హీరోగా నటించిన ‘హిట్-3’లో ‘కేజీఎఫ్’ ఫేం శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటిస్తోంది.