Nani Hit3 Violence Grammar.. ‘మార్కో’ సినిమా గుర్తుందా.? ‘కిల్’ సినిమా గుర్తుందా.? ఎలా మర్చిపోగలం.? ఆయా సినిమాల్లో, రక్తపాతం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.!
‘కిల్’ సినిమాలో హింస వేరు.! ‘మార్కో’ సినిమాలో హింస వేరు.! ‘కిల్’ కంటే దారుణం ‘మార్కో’ సినిమా రక్తపాతం విషయంలో.
హింస, రక్తపాతం లేకుండా సినిమాలు తీయలేమా.? ఎందుకు తీయలేం.? అన్నీ అలాంటి సినిమాలే రావట్లేదు కదా.! అప్పుడప్పుడూ వస్తున్నాయంతే.
కానీ, కొందరు హీరోలకు ఆ స్థాయి రక్తపాతం అస్సలు సూటవదు. ‘మార్క్-3’ సినిమా విషయంలో జరిగింది అదే.! కానీ, ‘హిట్టు బొమ్మ’ అంటూ ఊదరగొట్టేస్తున్నాం.
Nani Hit3 Violence Grammar.. నాని కూడా రంగంలోకి దిగేశాడు..
ఇక, నేచురల్ స్టార్ నాని ‘హిట్-3’ సినిమాలోనూ హింస, రక్తపాతాన్నే చూపించబోతున్నాడు. ‘హిట్-3’ ట్రైలర్ చూస్తే, ఎవరికైనా ఒళ్ళు గగుర్పాటుకి గురవడం ఖాయం.
సినిమా చూస్తే, హింస – రక్తపాతం గురించి ఎక్కువగా మాట్లాడుకోరు.. కథ, కథనం.. అలా కట్టి పడేస్తాయ్.. అని హీరో నాని ‘హిట్-3’ గురించి చెబుతున్నాడు.

‘ట్రైలర్ చూశాక కొంతమందికి భయం కలగొచ్చుగాక.. సినిమా చూస్తుంటే, కథలో లీనమైపోతారు’ అన్నది నాని వెర్షన్.
అలా చెబుతూనే, ‘చిన్న పిల్లలు, సున్నిత హృదయం గలవారూ సినిమాకి దూరంగా వుండండి’ అని నాని చెబుతుండడం గమనార్హం.
‘దేవర’ సినిమా కోసం పెద్ద మొత్తంలో రక్తాన్ని పోలిన ద్రవాన్ని వినియోగించినట్లు అప్పట్లో ప్రచారం జరిగింది. సినిమా చూశాక తుస్సుమంది వ్యవహారం.!
మహిళలు.. పిల్లల్ని దూరం చేసుకుంటే..
మామూలుగా అయితే, వెబ్ సిరీస్‌లలో హింస, రక్తపాతాన్ని ఎక్కువగా చూస్తుంటాం. అందునా, క్రైమ్ థ్రిల్లర్స్‌లో శాడిస్టుల మీదా, సైకోల మీదా అలాంటి సీన్స్ చిత్రీకరిస్తుంటారు.
కానీ, నేచురల్ స్టార్ నానికి ఏమయ్యింది.? నాని అభిమానులంటే, అందులో చిన్న పిల్లలు ఎక్కువగా వుంటారు. మహిళలు, వృద్ధులు కూడా నాని సినిమాల్ని ఎక్కువగా ఇష్టపడతారు.
Also Read: ‘లెనిన్’ అఖిల్.! అయ్యగారు ఈసారి ఏం చేస్తారో.!
హింస వైపు యూత్‌ని ఈ సినిమాలు నడిపిస్తాయని అనలేంగానీ, ఖచ్చితంగా యువత మీద హింసాత్మక సినిమాల ప్రభావం ఎంతో కొంత వుంటుంది.
నటులకీ కొంచెం బాధ్యత వుండాలి.! ఈ తరహా సినిమాలు చేసేటప్పుడు, ఒకింత ‘గ్రామర్’ అవసరం.! హీరో నాని అర్థం చేసుకుంటాడనే ఆశిద్దాం.