Table of Contents
నిజానికి నాని (Natural Star Nani) నటుడు కానే కాదు, ఎందుకంటే అతను మన పక్కింటి కుర్రాడిలానే అన్పిస్తాడు. నాని (Nani Jersey Preview) సినిమాల్ని చూస్తే, ఎవరైనా ఈ మాట ఒప్పుకోవాల్సిందే. తెరపై ఓ నటుడు నటిస్తున్నట్లుగా కాకుండా, మనింట్లోనో.. మన పక్కింట్లోనో వుండే కుర్రాడి జీవితాన్ని చూస్తున్నట్లు అనిపిస్తుంది అతని సినిమాల్ని చూసినప్పుడు. అదే నాని ప్రత్యేకత.
అందుకే నానికి ‘నేచురల్ స్టార్’ అనే గుర్తింపు దక్కింది. అవును, నాని నటించడు, జీవిస్తాడు. పాత్రల్లో లీనమైపోయే నాని అలా తెరపై కన్పిస్తోంటే, ఆయా పాత్రలు మాత్రమే మన కళ్ళ ముందు మెదులుతాయి. అలాంటి నాని ఇప్పుడు క్రికెటర్ పాత్రలో కన్పించబోతున్నాడు. క్రికెటర్ అర్జున్‌ని మనం తెరపై చూడబోతున్నాం.
సినిమా కోసం ఎంత కష్టపడాలో, అంతకు మించి కష్టపడటంలో నాని తర్వాతే ఎవరైనా. అయితే ఆ కష్టం తెరపై కన్పించనివ్వడు. అది నానికి మాత్రమే సాధ్యమైన ఇంకో ప్రత్యేకత అనడం అతిశయోక్తి కాదు. క్రికెట్ నేర్చుకున్నాడు, ఈ క్రమంలో గాయాల పాలయ్యాడు కూడా. అయితే అదంతా సినిమా కోసం పడే శ్రమలో భాగమేనని నాని చెబుతుంటాడు.
జెర్సీపై అంచనాలు.. అప్పుడలా, ఇప్పుడిలా.. Nani Jersey Preview
‘జెర్సీ’ (Nani Jersey Preview) సినిమాకి సంబంధించి తొలి వార్త వచ్చినప్పుడు, ఇదేంటీ.. టైటిల్ ఇలా వుందేంటీ.. అనే దీర్ఘాలు చాలామందిలో కన్పించాయి. అయితే, నాని తన మార్క్ వేశాడు. సినిమా నిర్మాణం జరుపుకుంటున్న కొద్దీ సినిమాపై క్రమక్రమంగా అంచనాలు బిల్డప్ అయ్యాయి. సినిమా ఓ కొలిక్కి వచ్చాక, ఆ అంచనాలు డబుల్ అయ్యాయి. రిలీజ్‌కి ముందు ఆ అంచనాలు ఇంకా పెరిగిపోయాయంటే అదీ నానికి ఉన్న క్రేజ్.
తెలుగు రాష్ట్రాల్లోనూ, ఓవర్సీస్‌లోనూ ‘జెర్సీ’ సినిమాకి ప్రీ రిలీజ్ బిజినెస్ ఓ రేంజ్‌లో జరిగింది. ప్రీ రిలీజ్ అంచనాలను మించి ఈ బిజినెస్ ఈక్వేషన్స్ వున్నాయంటే, అదీ నాని సత్తా. రికార్డు స్థాయిలో అమ్మకాలు నాని సినిమాలకు కొత్తేమీ కాదు.
సినిమా సినిమాకీ బిజినెస్ రేంజ్ పెంచుకుంటూ వెళుతున్న నానికి పరాజయాల్ని జీర్ణించుకోవడమెలాగో బాగా తెలుసు. ‘కృష్ణార్జునయుద్ధం’ సినిమా ఆశించిన రీతిలో ఆడలేదు.. అని గతంలోనే ఒప్పేసుకున్నాడు నాని. ‘కాదు, అది సూపర్ హిట్ అని నేను చెబితే దాని వల్ల నాకేంటి లాభం.?’ అని నాని తనదైన స్టయిల్లో చేసిన వ్యాఖ్యలు అందర్నీ ఆశ్చర్యపరుస్తాయి, ఆశ్చర్యపరిచాయి కూడా.
జెర్సీ కథ ఇదీ.. Nani Jersey Preview
‘జెర్సీ’ Nani Jersey Preview సినిమా విషయానికొస్తే, ఇదొక ఎమోషనల్ జర్నీ. క్రికెటర్ కావాలనుకునే ఓ కుర్రాడు, ఆ కల నెరవేర్చుకునే క్రమంలో చాలా కష్టపడతాడు. అయితే, కెరీర్‌ని నిలబెట్టుకునే క్రమంలో కొన్ని పొరపాట్ల కారణంగా క్రికెట్‌కి దూరమవుతాడు. తిరిగి ఆ క్రికెట్‌లో సత్తా చాటేందుకు ఆ వ్యక్తి పడే కష్టమే ఈ ‘జెర్సీ’ సారాంశం.
టీజర్, ట్రైలర్, సాంగ్ ప్రోమోస్.. ఇలా అన్నీ సినిమాపై అంచనాల్ని పెంచేస్తూనే వచ్చాయి. ఏ ఫ్రేమ్‌లో చూసినా మనకి నాని కన్పించడు, అతని పాత్రే కన్పిస్తుంది. తనదైన హావభావాలతో సినిమాని ఇంకో లెవల్‌కి తీసుకెళ్ళగల సత్తా వున్న నాని, ఈ సినిమాలోనూ తన సత్తా చాటినట్లే అనిపిస్తోంది ప్రోమోస్ చూసినప్పుడు.
విషాదాంతమా? కాదేమో! Nani Jersey Preview
నిజానికి ఇదొక విషాదాంతమయ్యే కథ అని మొదట్లో ప్రచారం జరిగితే, దాన్ని నాని (Natural Star Nani) కొట్టి పారేశాడు. అలాగని, హ్యాపీ ఎండింగ్ వుంటుందా? అంటే, చూచాయిగా ‘అవుననే సమాధానం’ అతని నుంచి వచ్చింది. విషాదాంతం, ఆనందభరితమైన ముగింపు అని చెప్పనుగానీ, ఓ మంచి ఫీల్‌తో ఆనందంగా ప్రేక్షకుడు సినిమా చూశాక థియేటర్ నుంచి బయటకు వస్తాడని నాని చెప్పాడు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ సీజన్ 12 (Indian Premiere League) మంచి రసపట్టుగా సాగుతున్న ఈ తరుణంలో క్రికెట్ (IPL Cricket) నేపథ్యంలో సాగే జెర్సీ సినిమాకి అడ్వాంటేజ్ బాగానే వుండొచ్చు.
గౌతమ్ తిన్ననూరి (Gowtam Tinnanuri) దర్శకత్వంలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ ఈ జెర్సీ (Nani Jersey Preview) చిత్రాన్ని నిర్మిస్తోంది. కన్నడ నటి శ్రద్ధా శ్రీనాథ్ (Shraddha Srinath) ఈ సినిమాలో నాని సరసన హీరోయిన్‌గా నటిస్తుండగా, తమిళ నటుడు సత్యరాజ్ మరో ముఖ్యమైన పాత్రలో నటిస్తున్నాడు. అనిరుధ్ సంగీతం అందించిన ఈ చిత్రంలోని పాటలు ఇప్పటికే మంచి రెస్పాన్స్ అందుకున్నాయి.
రివ్యూ.. మరికొద్ది గంటల్లో…