Nani Srinidhi Shetty Hit3.. ఒకే ఒక్క సినిమాతో దేశవ్యాప్తంగా ఆమె పేరు మార్మోగిపోయింది.! ఆమె ఎవరో కాదు, అందాల పోటీల నుంచి సినీ రంగంలోకి వచ్చిన శ్రీనిధి శెట్టి.!
‘కేజీఎఫ్’ సినిమాతో రాత్రికి రాత్రి స్టార్ అయిపోయింది శ్రీనిధి శెట్టి.! ఏం లాభం.? ఆ తర్వాత ఆ స్థాయి ప్రాజెక్టులేమీ ఆమెకు రాలేదు.
తమిళంలో విక్రమ్ సరసన ‘కోబ్రా’ అనే సినిమా చేసిందిగానీ, అదీ పెద్దగా వర్కవుట్ అవలేదు. స్టార్ హీరోయిన్ అవ్వాల్సిన శ్రీనిధి, కెరీర్‌లో డౌన్ ఫాల్ తప్పలేదు.
Nani Srinidhi Shetty Hit3.. నాని బ్రేక్ ఇస్తాడా.?
నేచురల్ స్టార్ నాని హీరోగా తెరకెక్కుతోన్న ‘హిట్-3’ సినిమాలో నటిస్తోంది శ్రీనిధి శెట్టి. కానీ, సినిమా ప్రమోషనల్ వీడియోల్లో శ్రీనిధి పెద్దగా కనిపించడం లేదు.
‘ప్రమోషనల్ వీడియోల్లో నేను కనిపించడం లేదన్నది వాస్తవం. కానీ, సినిమాలో నా పాత్రకు చాలా ప్రాధాన్యత వుంటుంది..’ అని చెబుతోంది శ్రీనిధి.

నాని కోసమే ఈ సినిమా ఒప్పుకున్నట్లు చెబుతున్న శ్రీనిధి శెట్టి, నాని మంచి పెర్ఫామర్.. అనీ, మంచి మనిషి అనీ.. సెలవిచ్చింది.
Also Read: సమీక్ష: ‘ఆరెంజ్’! అప్పట్లో డిజాస్టర్! ఇప్పుడేమో వసూళ్ళ ప్రభంజనం!
టీజర్, ట్రైలర్‌లో రక్తపాతం తప్ప, హీరోయిన్‌తో హీరోకి రొమాంటిక్ ట్రాక్ లాంటివేవీ కనిపించలేదు. మరి, శ్రీనిధికి ఈ సినిమా ఎలాంటి బ్రేక్ ఇస్తుందో ఏమో.!
అన్నట్టు, పాటలకు సంబంధించిన ప్రోమోల్లో మాత్రం, శ్రీనిధి – నాని పెయిర్ బావుంది. అఫ్‌కోర్స్.. నానితో, ఏ హీరోయిన్ అయినా పెయిర్ అదిరిపోతుందనుకోండి.. అది వేరే సంగతి.