గేమ్ ఛేంజర్: దిమ్మ తిరిగి బొమ్మ కనబడింది.!

 గేమ్ ఛేంజర్: దిమ్మ తిరిగి బొమ్మ కనబడింది.!

SJ Suryah

Gam Changer SJ Suryah.. కేవలం నటుడు మాత్రమే కాదు, దర్శకుడు కూడా.! పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో ‘ఖుషీ’ సినిమాని తెరకెక్కించిన దర్శకుడతడు.

‘సరిపోదా శనివారం’ సినిమాలో హీరో నానిని డామినేట్ చేసిన నటుడతడు.! అతనెవరో తెలుసు కదా.? ఎస్.జె.సూర్య.

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘గేమ్ ఛేంజర్’ సినిమాలో పవర్‌ఫుల్ రోల్‌లో కనిపించబోతున్నాడీ విలక్షణ నటుడు.

Gam Changer SJ Suryah.. డబ్బింగ్…

‘గేమ్ ఛేంజర్’ సినిమాలోని తన పాత్ర కోసం డబ్బింగ్ చెబుతున్నట్లు వెల్లడించిన ఎస్.జె.సూర్య, ‘రెండు సీన్లకు డబ్బింగ్ చెప్పడానికి మూడు రోజుల సమయం పట్టింది..’ అని వివరించాడు.

ట్విట్టర్ వేదికగా ఈ విషయాన్ని ఎస్.జె.సూర్య ప్రకటించాడు. ‘దీనెమ్మ.. దిమ్మ తిరిగి బొమ్మ కనబడింది’ అనే స్థాయిలో ఔట్‌పుట్ వచ్చిందన్నది ఎస్.జె.సూర్య సోషల్ మీడియా వేదికగా వెల్లడించిన విషయం.

రామ్ చరణ్ అలాగే, శ్రీకాంత్‌లతో కలిసి నటించిన సన్నివేశాలకు డబ్బింగ్ తాజాగా పూర్తి చేశాడట ఎస్.జె.సూర్య.

Also Read: అప్పట్లో అనుష్క.! ఇప్పుడేమో దిశా పటానీ.!

‘థియేటర్లలో ఈ సీన్స్‌కి వచ్చే రెస్పాన్స్ వేరే లెవల్‌లో వుంటుంది’ అని అంటున్నాడీ నటుడు. ‘పిచ్చి.. పిచ్చి.. పిచ్చి.. అప్లాజ్ వస్తుంది.. పోతారు, మొత్తం పోతారు..’ అంటూ ‘గేమ్ ఛేంజర్’ దర్శకుడు శంకర్‌కి థ్యాంక్స్ చెప్పాడు.

‘it’s gonna be a RAM’PING SHANKAR’ANTHI see U soon friends’ అంటూ ట్వీటుని ముగించాడు నటుడు ఎస్.జె. సూర్య.

నాని హీరోగా నటించిన ‘సరిపోదా శనివారం’ సినిమాతో తెలుగు సినీ పరిశ్రమలో ‘ఎస్.జె.సూర్య’ రాత్రికి రాత్రి స్టార్ విలన్ అయిపోయిన సంగతి తెలిసిందే.

Digiqole Ad

Related post