Table of Contents
Nara Lokesh Yuva Galam.. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి, ఎమ్మెల్సీ నారా లోకేష్ ‘యువగళం’ పేరుతో సుదీర్ఘ పాదయాత్రకు శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే.
పాదయాత్రలు తెలుగుదేశం పార్టీకి కొత్త కాదు. గతంలో టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు, ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో సుదీర్ఘ పాదయాత్ర చేశారు. అది అప్పట్లో సంచలనం.
వయసు మీద పడినా, అనారోగ్య సమస్యలు వేధిస్తున్నా.. చంద్రబాబు పట్టుదలతో పాదయాత్ర చేశారు.! అలా, ఆ పాదయాత్ర టీడీపీకి తిరిగి అధికారం తీసుకొచ్చింది.
Nara Lokesh Yuva Galam నారా లోకేష్ యాత్ర తీరు తెన్నులు వేరే లెవల్..
పాదయాత్రల్లో అప్పటికీ, ఇప్పటికీ చాలా మార్పులొచ్చాయి. కొన్ని టైమ్ పాస్ పాదయాత్రల్ని చూస్తున్నాం. వీకెండ్ విశ్రాంతి తీసుకుని మరీ పాదయాత్రలు చేస్తున్నారు.

అయితే, నారా లోకేష్ పాదయాత్రలో ఎలాంటి విరామాలూ వుండబోవని తెలుస్తోంది. అత్యంత పకడ్బందీగా నారా లోకేష్ పాదయాత్రను టీడీపీ డిజైన్ చేసింది.
ఈ నేపథ్యంలోనే నారా లోకేష్ పాదయాత్రను అడ్డుకునేందుకు ఆంధ్రప్రదేశ్‌లోని అధికార వైసీపీ, చిత్ర విచిత్రమైన నిబంధనల్నీ, జీవోల్నీ తెరపైకి తెస్తోందనన విమర్శలున్నాయి.
ఎవరడ్డుకున్నా పాదయాత్రలో తగ్గేదే లే.!
ఎవరు ఎలాంటి ఇబ్బందులు కలిగించినా, పాదయాత్ర విషయంలో తగ్గేదే లే.. అంటున్నారు నారా లోకేష్.
టీడీపీని తిరిగి అధికారంలోకి తీసుకొస్తానంటున్న నారా లోకేష్, టీడీపీ గెలవడం ఓ చారిత్రక అవసరమని నినదిస్తున్నారు.
2019 ఎన్నికల్లో మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయిన నారా లోకేష్, ఈసారి మాత్రం బంపర్ విక్టరీ కొడతానంటున్నారు.
అప్పట్లో నారా లోకేష్ ఓటమి కోసం వైసీపీ తీవ్ర ప్రయత్నాలే చేసింది. చివరి నిమిషం వరకూ లెక్కలేకుండా డబ్బుల్ని విచ్చలవిడిగా వైసీపీ ఖర్చు పెట్టిందని టీడీపీ ఆరోపణలు చేయడం తెలిసిన సంగతే.
ఇదిలా వుంటే, నారా లోకేస్ ఈసారి టీడీపీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రమోట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
నారా లోకేష్ పాదయాత్ర వ్యవహారాల్ని ఆయన తండ్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు ప్రత్యేకంగా పర్యవేక్షించనున్నారు.
ఓ వైపు టీడీపీ అనుకూల మీడియా, ఇంకో వైపు టీడీపీ అభిమానులు.. వెరసి ‘యువగళం’ పాదయాత్ర విజయవంతానికి.. టీడీపీ సర్వశక్తులూ ఒడ్డుతోంది.
Mudra369
రాష్ట్రం వైసీపీ పాలనలో అధోగతిపాలయ్యిందనీ, తిరిగి రాష్ట్రం గాడిన పడాలంటే టీడీపీ అధికారంలోకి రావాల్సిందేనన్నది ఆయన వాదన.
పాదయాత్ర.. అంత వీజీ కాదు.!
రాజకీయాలు మారాయ్.! 400 రోజులపాటు 4000 కిలోమీటర్ల మేర నారా లోకేష్ పాదయాత్ర నిర్వహించనున్నట్లు టీడీపీ చెబుతోంది.
అయితే, ‘యువగళం’ పాదయాత్రకు అడుగడుగునా ఆటంకాలు కలిగించేందుకు వైసీపీ సిద్ధమవుతోంది. మరోపక్క, రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశం వున్నందున.. పాదయాత్ర మధ్యలోనే ఆపాల్సి వస్తే.?
Also Read: తొక్కినేని ‘మెంటల్’ రచ్చ: నాగచైతన్యకి బాలయ్య మాస్ వార్నింగ్.!
ఏమో, రాజకీయాల్లో ఏమైనా జరగొచ్చు..
అన్నట్టు, పాదయాత్రతో నారా లోకేష్ బరువు తగ్గుతాడేమోగానీ, టీడీపీ పుంజుకునే అవకాశం లేదంటున్నారు వైసీపీ నేత, మంత్రి రోజా.
ఇంతకీ, నారా లోకేష్ ‘యువగళం’ పాదయాత్ర టీడీపీకి ఎంత బలం.? రానున్న రోజుల్లో తెలుస్తుందది.!