Prashant Kishor రాజకీయాల గురించి కాస్త అవగాహన వున్నా, ప్రశాంత్ కిశోర్ గురించి తెలుస్తుంది. ఫక్తు రాజకీయ నాయకుడు కాదుగానీ, దేశ రాజకీయాలపై ఆయన తనదైన ముద్ర వేశాడు.
జన సురాజ్ పేరుతో బీహార్ నుంచి కొత్త రాజకీయం మొదలు పెట్టిన ప్రశాంత్ కిశోర్, దేశ ప్రజానీకానికి ‘ఎన్నికల వ్యూహకర్త’గా సుపరిచితుడు.
భారతీయ జనతా పార్టీకీ అలాగే, వివిధ రాజకీయ పార్టీలకు ‘ఐ ప్యాక్’ ద్వారా సేవలందించిన (!?) ఘనుడు ప్రశాంత్ కిశోర్.
తమిళనాడులో డీఎంకే, ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్సీపీ, ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ, పశ్చిమ బెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్.. ఇలా చాలా పార్టీలు ఆయనకు ‘క్లయింట్స్’గా వున్నాయ్.
రాజకీయ పార్టీల ఉద్ధారకుడు.!
ఆయా పార్టీలకు గెలిచే అవకాశాల గురించి సూచనలు, సలహాలు ఇస్తుంటాడు ప్రశాంత్ కిశోర్. జనంలో ఎలాంటి అభిప్రాయాలు ఆయా పార్టీల పట్ల వున్నాయో తెలుసుకుని, ఆయా పార్టీలకు సవివర నివేదిక అందిస్తాడాయన.
అంతేనా, సమాజంలో అలజడిని ఎలా సృష్టించాలో కూడా ప్రశాంత్ కిశోర్ వ్యూహాలు రచిస్తాడనే విమర్శ వుంది. ఆయా పార్టీల అధినేతలపై దాడి జరిగిందనేలా మాయ చేసే విద్యలు ప్రశాంత్ కిశోర్ వద్ద చాలానే వుంటాయంటారు.
అవన్నీ పక్కన పెడితే, ఏపీ సీఎం వైఎస్ జగన్, బీహార్ సీఎం నితీష్ కుమార్ లాంటివారికి సాయపడే కంటే, కాంగ్రెస్ పునరుజ్జీవానికి కృషి చేసి వుంటే బావుండేదని ప్రశాంత్ కిశోర్ తాజాగా అభిప్రాయపడ్డారట.
కటకటా.! ఇన్నాళ్ళకు జ్ఞానోదయం అయ్యిందా.? అని ఆయన మీద సెటైర్లేస్తున్నారు నెటిజన్లు. రాజకీయ పార్టీలు ప్రజల్ని మెప్పించాలి. కానీ, మాయ చేస్తున్నాయ్.
మాయగాడి కొత్త నీతులు.!
ఆ మాయని సృష్టించినోడు ప్రశాంత్ కిశోర్. ఇప్పుడు నీతులు చెబుతున్నాడు.. జ్ఞానోదయమంటున్నాడు.
Also Read: పిల్లల్ని కనడానికి పెళ్ళితో పనేంటి.?
ప్రశాంత్ కిశోర్ ఆవేదన నిజమే అయితే, ఆయన దేశానికి చాలా నష్టం చేసినట్లు భావించాలి. రాజకీయాలతో వ్యాపారం చేశాడాయన.! ప్రజల సెంటిమెంట్లతో ఆడుకున్నాడు ప్రశాంత్ కిశోర్.!
ఇంతలా పశ్చాత్తాప పడే పరిస్థితి ప్రశాంత్ కిశోర్‌కి ఎందుకు వచ్చినట్లు.?