National Leader Pawan Kalyan.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో ‘బ్రో’ సినిమాని తెరకెక్కించాడు దర్శకుడు సముద్రఖని. ఈ నెల 28న ఈ ‘బ్రో’ ప్రేక్షకుల ముందుకు వస్తోంది.
తమిళంలో ‘వినోదియ సితం’ పేరుతో వచ్చిన సినిమాని తెలుగులోకి ‘బ్రో’ పేరుతో రీమేక్ చేశారు. ‘వినోదియ సితం’ సినిమాలో సముద్రఖని నటించాడు, ఆ చిత్రానికి దర్శకత్వమూ వహించాడు.
సినిమా ప్రమోషన్లలో భాగంగా మీడియాతో మాట్లాడుతూ, పవన్ కళ్యాణ్‌ని (Janasenani Pawan Kalyan) ‘జాతీయ నాయకుడి’గా అభివర్ణించారు సముద్రఖని.
National Leader Pawan Kalyan.. స్టేట్ లీడర్ కాదు.. నేషనల్ లీడర్.!
‘బ్రో’ సినిమా షూటింగ్ సమయంలో, పవన్ కళ్యాణ్‌తో (Power Star Pawan Kalyan) ఇంటరాక్ట్ అయినప్పుడు, ఆయన భావజాలం తనకు అర్థమయ్యిందని సముద్రఖని చెప్పాడు.
‘ఆయన స్టేట్ లీడర్ కాదు.. నేషనల్ లీడర్. ఆయన ఆలోచనలు ఆచరణలోకి వస్తే, మనం కొత్త లోకంలో వుంటాం..’ అన్నాడు సముద్రఖని (Samuthirakani).
ఆ శక్తిని ఆ దేవుడే, పవన్ కళ్యాణ్‌కి ఇస్తాడనీ, ముందు ముందు పవన్ కళ్యాణ్‌ని (Jana Sena Party Chief Pawan Kalyan) గొప్ప నాయకుడిగా మనమంతా చూడబోతున్నామని సముద్రఖని చెప్పుకొచ్చాడు.
మార్పులు చేర్పులు..
స్వర్గంలో కులాలు, మతాలు, ప్రాంతాలు, భాషలు.. ఇలాంటి తేడాలేవీ వుండవ్.. అన్న పాయింట్‌తోనే ‘బ్రో’ (Bro The Avatar) తెరకెక్కిందట.
ఓ సన్నివేశంలో, ‘మరి నరకంలో.?’ అని కీలక పాత్రధారి ప్రశ్నిస్తే, ‘టైమ్’ చెబుతుంది.. ‘ఆ నరకం నుంచే కదా నిన్ను తీసుకెళుతున్నది’ అని సమాధానమిస్తుందిట.
Also Read: ‘వారాహి’ అంటే పంది కాదు.! దేవతరా.! అచ్చోసిన ఆంబోతూ.!
సినిమాలో కొన్ని డైలాగ్స్, సన్నివేశాల గురించి చెబితే, త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) ఆశ్చర్యపోయారనీ, అక్కడికి అక్కడే చిన్న చిన్న మార్పులు చేశారని సముద్రఖని చెప్పారు.
పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ (Sai Dharam Tej) నటిస్తే బావుంటుందని చెప్పిందే త్రివిక్రమ్ శ్రీనివాస్ అని సముద్రఖని వివరించాడు.
ఈ ‘బ్రో’ (Bro The Avatar) సినిమాకి త్రివిక్రమ్ శ్రీనివాస్ రచనా సహకారం అందించిన సంగతి తెలిసిందే.