Natural Face Glow.. అందం కోసం బ్యూటీ పార్లర్లంటూ, మార్కెట్లో లభించే అనేక రకాల క్రీములంటూ తిరిగే పనే లేదు. ఈ చిన్న చిన్న టిప్స్ పాఠిస్తే చాలు.
చర్మంపై ముడతల్ని, మొండి మచ్చల్ని మాయం చేసి అందంగా సహజసిద్ధమైన కాంతితో మెరిసిపోవచ్చు. అందుకోసం పెద్దగా కష్టపడక్కర్లేదు సుమీ.
మన ఇంట్లో లభించే సాధారణ ఇంగ్రీడియంట్స్ వాడి అందంగా మెరిసిపోయే కాంతివంతమైన చర్మాన్ని పొందొచ్చు.
Natural Face Glow.. పసుపు చందనంతో.!
ఒక బౌల్‌లో కొన్ని పచ్చిపాలు తీసుకుని, అందులో రెండు టీ స్పూన్ల నిమ్మరసం మిక్స్ చేసుకోవాలి. ఓ ఐదు నిముషాల పాటు ఆ పాలను అలాగే వదిలేయాలి.

ఆ తర్వాత అందులో కొద్దిగా పసుపు, చందనం పొడి కలపాలి. వీలైతే కొద్దిగా కుంకుమ పువ్వు కూడా చేరిస్తే మెరుగైన ఫలితాలు వస్తాయ్.
ఈ మిశ్రమాన్ని బాగా కలిపి ముఖానికి ప్యాక్‌లా వేసుకోవాలి. ముఖంతో పాటూ, మెడకు కూడా రాస్తే ఇంకాస్త బావుంటుంది.
అలా ఓ 20 నిముషాల పాటు ఆ ప్యాక్‌ని వదిలేసి, తర్వాత గోరు వెచ్చని నీటితో కడిగేస్తే సరి. అనూహ్యంగా మీ ఫేస్ గ్లో పెరిగిపోతుంది.
సూచన: ఇంటర్నెట్‌లో అందుబాటులో వున్న సమాచారం, అలాగే కొందరు వైద్య నిపుణులు, వ్యక్తుల ఆభిప్రాయాల సంకలనం మాత్రమే ఇది.
సొంత వైద్యం అత్యంత ప్రమాదకరం కావచ్చు. ఏ చిట్కా పాఠించాలన్నా వైద్య నిపుణుల సూచన, సలహా తప్పనిసరి.
ఒక మందు లేదా ఒక మూలిక అందరికీ ఒకేలా పని చేస్తుందని చెప్పలేం. కేవలం అవగాహన కోసం మాత్రమే ఈ సమాచారం.
Mudra369
నో పార్లర్స్.. నో క్రీమ్స్.. బ్యూటీ ‘ఫుల్’ షైన్ స్కిన్ మీ సొంతం. రెండు రోజులకోసారి ఇలా చేస్తే సరిపోతుందంతే.
ఆగండాగండీ.. కొందరి చర్మం సున్నితంగా వుండొచ్చు. ఒక్కోసారి చిట్కాలు, చర్మ సౌందర్యానికి ముప్పు తెచ్చినా తేవొచ్చు. ఏదన్నా చిట్కా పాటించేముందు జర జాగ్రత్త సుమీ.!