Navya Swamy Bigg Boss Telugu 5.. బుల్లితెర అంటే ఆషామాషీ వ్యవహారం కాదు. టీవీ సీరియళ్ళకున్న క్రేజ్, పెద్ద హీరోల సినిమాలకీ వుండదేమో.. అనేంతలా తయారైంది వ్యవహారం. మరీ, ఇది ‘అతి’ అయినాగానీ, ఒక్కోసారి టీవీ సీరియళ్ళ గురించి సోషల్ మీడియా వేదికల్లోనూ, ఇతరత్రా సందర్భాల్లోనూ జరుగుతున్న చర్చ చూస్తోంటే, అదంతా నిజమేనేమో అనిపించకమానదు.
బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 వ్యవహారం నడుస్తోందిప్పుడు. ఎవరు ఈ సీజన్‌లో కంటెస్టెంట్స్‌గా వుండబోతున్నారన్నదానిపై గత కొద్ది రోజులుగా నానా యాగీ జరుగుతోంది. అందరిలోకీ ప్రముఖంగా వినిపిస్తున్న పేరు నవ్య స్వామిదే. ‘నా పేరు మీనాక్షి’ సహా పలు సీరియళ్ళలో నటిస్తోంది నవ్య స్వామి. నిజానికి, ఆమె చేస్తున్న సీరియళ్ళు తక్కువే. కానీ, వాటి ద్వారా వచ్చిన పాపులారిటీ చాలా చాలా ఎక్కువ.
Also Read: గ్లామర్ డబుల్ డోస్.. అంతకు మించి.!
అన్నట్టు, బిగ్ బాస్ సీజన్ 3 తెలుగు కంటెస్టెంట్స్‌లో ఒకడైన రవి కృష్ణతో నవ్య స్వామికి ఎఫైర్ వుందంటూ పెద్ద రచ్చ జరుగుతోంది గత కొంతకాలంగా. దాని చుట్టూనే కొన్ని స్పెషల్ ప్రోగ్రామ్స్ కూడా నడుస్తున్నాయి టీవీ ఛానళ్ళలో. ఆ గాసిప్స్‌ని రవికృష్ణ, నవ్య స్వామి జంటగా ఎంజాయ్ చేస్తున్నారు కూడా.
ఇక, ఇప్పటిదాకా నవ్య స్వామి, బిగ్ బాస్ గురించి స్పందించడంలేదు. కానీ, ఆమెకు ప్రస్తుతం వున్న ఫాలోయింగ్ చూస్తే, బిగ్ బాస్ రియాల్టీ షో 5 వ సీజన్‌లో (Bigg Boss Telugu 5) ఆమె గనుక కంటెస్టెంట్ అయితే.. అదో సంచలనమే అవుతుంది. బిగ్ రియాల్టీ షోకి కూడా సూపర్బ్ గ్లామర్ వచ్చిపడుతుంది.
చూద్దాం.. కొద్ది రోజుల్లోనే కంటెస్టెంట్లపై క్లారిటీ వచ్చేయనున్న దరిమిలా, నవ్య స్వామి లక్ ఎలా వుండబోతోందో.!