Nayani Pavani BB8 Telugu.. బిగ్ బాస్ తెలుగు రియాల్టీ షో ఆమెకి కొత్త కాదు. కాకపోతే, అప్పట్లోనూ వైల్డ్ కార్డ్ ఎంట్రీనే.. ఇప్పుడు.. అంటే, ఎనిమిదో సీజన్‌లో కూడా వైల్డ్ కార్డ్ ఎంట్రీనే.
గతంలో వైల్డ్ కార్డ్ (Bigg Boss Telugu Season 8) ఎంట్రీ ఇచ్చినప్పుడు, ఓ మెరుపులా దూసుకొచ్చి.. అంతే వేగంతో మాయమైపోయిందామె.
ఆమె ఎవరో కాదు, ‘చిచ్చర పిడుగు’ నయని పావని.! డాన్సులేయగలదు.. చలాకీగా సందడి చేయగలదు.. కానీ, ఎందుకో.. తొలిసారి బిగ్ హౌస్‌లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చి, ఎక్కువ రోజులు హౌస్‌లో వుండలేకపోయింది.
Nayani Pavani BB8 Telugu.. రెండోస్సారి..
ఈసారి మాత్రం, కాస్త ఎక్కువ రోజులే హౌస్‌లో వుండగలిగింది నయని పావని. ఎలాగైనా, ఈసారి టైటిల్ గెలుస్తానని నయని పావని చెప్పినా, అదెంతవరకు సాధ్యమవుతుందన్నది వేరే చర్చ.
ప్రస్తుతానికైతే హౌస్‌లో నయని పావని బాగానే అటెన్షన్ పొందుతోంది. ఆడియన్స్ మనసుల్లోనూ ‘చిచ్చర పిడుగు’ అనే ముద్రని బలంగా వేయగలుగుతోంది.

ఓ టాస్క్‌లో విష్ణు ప్రియని ఓడించి, బైక్ సొంతం చేసుకున్న తీరు, నయని పావని (Nayani Pavani) చలాకీతనాన్ని చెప్పకనే చెప్పింది.
అయితే, బిగ్ బాస్ తెలుగు రియాల్టీ షో.. లెక్కలు వేరు.! హోస్ట్ అక్కినేని నాగార్జున చేతుల్లోనూ కంటెస్టెంట్ల భవితవ్యం ఆధారపడి వుండదు.
ఏమో.. ఈసారేం చేస్తుందో.!
ఆయా కంటెస్టెంట్ల ఆట తీరు విషయమై, బిగ్ బాస్ నిర్వాహకులకు పాజిటివ్ ఫీలింగ్ వుండాలి. లేకపోతే, ఆడియన్స్ ఓట్లేసినా ప్రయోజనం వుండదు.
Also Read: కట్టుకున్న భార్యని రోడ్డు మీదకు లాగేసిన ‘పాండిత్యం’.!
గ్లామర్ నయని పావనికి అదనపు ఆకర్షణ అయినా, అదెంతవరకు ఆమెను హౌస్‌లో ఎక్కువ రోజులు వుంచుతుందన్నది ఇప్పుడే చెప్పలేం.
ప్రేరణ, యష్మి, హరితేజ, విష్ణు ప్రియ.. వీళ్ళందరిలో తనదైన ప్రత్యేకతను చాటుకుంటేనే నయని పావని, గేమ్‌లో ముందుకెళ్ళగలుగుతుంది. అదే సమయంలో మేల్ కంటెస్టెంట్ల నుంచీ టఫ్ ఫైట్ నయని పావనికి తప్పదు.