NBK108 Vijayadasami Ayudhapuja.. నందమూరి బాలకృష్ణ కొత్త సినిమా విడుదల ఖరారయ్యింది. విజయదశమి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ కొత్త సినిమా.
ప్రస్తుతానికైతే ‘ఎన్బికె108’గా ఈ సినిమాని పేర్కొంటున్న సంగతి తెలిసిందే. టైటిల్ ఇంకా ఖరారు కావాల్సి వుంది. కాజల్ అగర్వాల్ ఈ సినిమాలో హీరోయిన్.
అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో శ్రీలీల మరో ఇంపార్టెంట్ చేస్తోన్న సంగతి తెలిసిందే.
NBK108 Vijayadasami Ayudhapuja.. విజయదశమికి బాలయ్య ఆయుధపూజ..
‘విజయదశమికి ఆయుధపూజ’ అంటూ సినిమా విడుదలకు సంబంధించి ఓ పోస్టర్ని చిత్ర నిర్మాణ సంస్థ విడుదల చేసింది. అయితే, అందులో డేట్ మాత్రం ప్రకటించలేదు.

ఈ విజయదశమికి తెలుగులో రామ్ – బోయపాటి సినిమాతోపాటుగా, రవితేజ సినిమా ‘టైగర్ నాగేశ్వరరావు’ కూడా విడుదల కాబోతోంది.
దాంతో, అటు రామ్ పోతినేనికీ, ఇటు రవితేజకీ బాలయ్య రూపంలో దబిడి దబిడే.. అంటూ బాలయ్య అభిమానులు సోషల్ మీడియా వేదికగా కామెంట్లేస్తున్నారు.
Also Read: నిజాయితీగా వున్నా విడాకులొచ్చాయ్: సమంత వైరల్ కామెంట్స్
‘అఖండ’, ‘వీర సింహా రెడ్డి’ సినిమాల తర్వాత.. హ్యాట్రిక్ కోసం బాలయ్య రెడీ అయ్యాడు. పైగా, విజయదశమి.. అందునా ఆయుధ పూజ అంటున్నారాయె.!
సో, చూడాలిక.. బాలయ్య ఆయుధపూజ ఎలా వుంటుందో.! ఆయుధపూజ.. ఇదేదో టైటిల్ బాగానే వున్నట్టుందే.!