Nidhhi Agerwal Mob Attack.. నటి నిధి అగర్వాల్, ‘ది రాజా సాబ్’ సినిమాకి సంబంధించిన ఓ సాంగ్ రిలీజ్ నిమిత్తం, హైద్రాబాద్‌లోని ఓ షాపింగ్ మాల్కి వెళితే, అక్కడామెపై దాడి జరిగింది.
దాడి అంటే, ఆషామాషీ దాడి కాదు. పెద్ద సంఖ్యలో జనం ఆమె మీద పడ్డారు. సినీ ప్రముఖుల్ని, అందునా హీరోయిన్లని చూసేందుకు జనం ఎగబడ్డం మామూలే.
ఆ ఎగబడ్డం కాస్తా, అత్యంత భయంకరంగా జరిగింది. ఒక్కసారిగా అంతమంది ఎగబడ్డంతో నిధి అగర్వాల్ పరిస్థితి అత్యంత దారుణంగా మారిపోయింది.
Nidhhi Agerwal Mob Attack.. ఎగబడ్డం.. హీనాతి హీనం.!
బౌన్సర్లు సైతం ఏమీ చేయలేకపోయారు. కొంతమంది జనమే, ఆమెను జాగ్రత్తగా కారు ఎక్కించేందుకు ప్రయత్నించారు. వారి సాయంతో, బౌన్సర్లు నిధి అగర్వాల్‌ని ఎలాగైతేనేం, కారెక్కించేశారు.
సినీ ప్రముఖులపై జనం ఎగబడ్డం కొత్తేమీ కాదు. ఈ సంగతి నిర్వాహకులకి తెలియకుండా వుంటుందా.? మరి, తగినన్ని జాగ్రత్తలు తీసుకోవాలి కదా.?

ఎంతలా జాగ్రత్తలు తీసుకున్నా, ఒక్కోసారి ఎగబడే జనాన్ని కంట్రోల్ చేయడం కష్టమవుతుంది. క్షణాల్లో పరిస్థితి భయానకంగా తయారవుతుంటుంది.. జనాన్ని కంట్రోల్ చేయడం అసాధ్యమైపోతుంది.
ఇదంతా తెలిసీ, సినీ సెలబ్రిటీల్ని జనంలోకి ఎందుకు తీసుకొస్తారు.? అంటే, ప్రమోషన్స్ కోసం తప్పదు మరి.! జరగకూడనిది ఏదైనా జరిగితేనో.? ఆ మాత్రం సోయ వుంటే, ఇంకేం.?
తప్పెవరిది.?
ఎగబడే జనాలది ఇలాంటి సందర్భాల్లో ఎంత తప్పుంటుందో.. ఆ జనాల్లోకి సినీ సెలబ్రిటీల్ని తీసుకొచ్చేవాళ్ళదీ అంతే తప్పుంటుంది.
పాపం.. నిన్నటి ఘటనలో, నిధి అగర్వాల్ ఎంతలా భయభ్రాంతులకు గురై వుంటుందో కదా.? సినిమా ప్రమోషన్స్ విషయంలో నిధి అగర్వాల్ చాలా ఉత్సాహంగా కనిపిస్తుంటుంది.
Also Read: లెహెంగా ఖరీదు లచ్చ.! చీప్ అండ్ బెస్టేగా.!?
ఇకపై, సినీ ప్రమోషన్లంటేనే నిధి అగర్వాల్ భయపడిపోతుందేమో.! ఒక్కటి మాత్రం నిజం.. సినీ సెలబ్రిటీల్ని చూసి ఆనందించడం తప్పు కాదు.. వాళ్ళపై ఎగబడటం, భయభ్రాంతులకు గురిచేయడం దారుణం.
ఎగబడింది మగాళ్ళే.. నిధి అగర్వాల్‌ని ఆ క్షణంలో కాపాడిందీ, అందులో కొందరు కుర్రాళ్ళే.! కొంతమంది ఆమెను ఎక్కడెక్కడో తాకారు, జుగుప్సాకరంగా ప్రవర్తించారు.
మరికొందరు, ఆమెను జాగ్రత్తగా కారెక్కించే ప్రయత్నంలో, గాయపడ్డారు కూడా.
