Niharika Konidela Chaitanya Divorce.. సినీ నటి నిహారిక విడాకుల వ్యవహారం గత కొద్ది రోజులుగా కేవలం గాసిప్స్‌కి మాత్రమే పరిమితమైంది.
నిహారిక కావొచ్చు, ఆమె కుటుంబ సభ్యులు కావొచ్చు.. ఇంతవరకు ఈ విడాకుల వ్యవహారంపై ఎక్కడా పెదవి విప్పలేదు.
కానీ, ఇప్పుడిక అంతా అధికారికం. నిహారిక ఆమె భర్త నుంచి విడాకులు పొందారు. ఇద్దరూ విడాకుల కోసం కోర్టును ఆశ్రయించారు.!
Niharika Konidela Chaitanya Divorce.. విడాకులు వింతేమీ కాదుగానీ..
ట్రెండ్ మారింది.. అభిప్రాయబేధాలు చాలా ఈజీగా వచ్చేస్తున్నాయ్ భార్యాభర్తల నడుమ. చట్టబద్ధంగా విడిపోవడం అనేది సర్వసాధారణమైపోయింది.

కలిసి కొట్టుకుంటూ వుండటం కన్నా, విడిపోయి స్నేహితుల్లా అయినా వుండటం మేలన్న భావన చాలా జంటల్లో కనిపిస్తోంది.
తప్పా.? ఒప్పా.? అన్నది వేరే చర్చ. సినీ సెలబ్రిటీలకు ఇలాంటి విషయాల్లో విపరీతమైన హైప్, ట్రోలింగ్ సర్వసాధారణం.
అసలెందుకు విడిపోయినట్టు.?
పెద్దలు కుదర్చిన ప్రేమ వివాహం లాంటిదే నిహారికది. కష్టకాలంలోనూ నిహారికకి (Niharika Konidela) మెట్టినిల్లు నుంచి మద్దతు లభించింది.
కానీ, ఏం జరిగిందో తెలియదుగానీ, నిహారిక చివరికి భర్త నుంచి దూరం అవక తప్పలేదు.! ఏం జరిగి వుంటుందబ్బా.? అంటూ, లోతైన దర్యాప్తు చేసేస్తున్నాయి మీడియా సంస్థలు.
Also Read: ఛి.. ఛీ.! తమన్నాకి ఇంత ఖర్మ పట్టిందేంటీ.?
ఓ వైపు అన్న వరుణ్ తేజ్‌కి నటి లావణ్య త్రిపాఠితో ఎంగేజ్మెంట్.. ఇంకోపక్క నిహారిక విడాకుల వ్యవహారం.. వెరసి, ఇదొక చిత్రమైన సందర్భం.. నాగబాబు కుటుంబంలో.!