Niharika Konidela Sangeeth Shobhan.. పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ పతాకంపై గతంలో ‘కమిటీ కుర్రాళ్ళు’ పేరుతో ఓ సినిమాని నిహారిక కొణిదెల నిర్మించిన సంగతి తెలిసిందే.
‘కమిటీ కుర్రాళ్ళు’ మంచి విజయాన్ని అందుకుంది కూడా.! నిర్మాతగా తొలి ప్రయత్నంలోనే హిట్టు కొట్టిన నిహారిక, తన రెండో సినిమాని త్వరలో పట్టాలెక్కించబోతున్నారు.
ఈసారి సంగీత్ శోభన్ హీరోగా నిహారిక ఓ సినిమాని నిర్మించనున్నారు. ఈ చిత్రానికి మానస శర్మ రచన, దర్శకత్వం వహించనున్నారు.
Niharika Konidela Sangeeth Shobhan.. నిర్మాతగా నిహారిక ప్రయాణం..
పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ పతాకంపై షార్ట్ ఫిలింస్, వెబ్ సిరీస్.. ఇలా సాగిన నిహారిక ప్రయాణం, సినిమాల వైపుగా టర్న్ తీసుకుంది.
నిర్మాతగా తొలి ప్రయత్నంతోనే నిహారిక సూపర్ హిట్ దక్కించుకోవడం విశేషమే. అంతకు ముందు నటిగా, నిహారిక ప్రయాణం ఏమంత సజావుగా సాగలేదు.
అలాగని, నటనకు పూర్తిగా ఫుల్ స్టాప్ పెట్టెయ్యలేదు నిహారిక. మొన్నీమధ్యనే ఓ తమిళ సినిమాలోనూ నిహారిక నటించిన సంగతి తెలిసిందే.
సంగీత్ శోభన్.. ట్రెండీ హీరో..
సోలో హీరోగా సంగీత్ శోభన్ చేస్తున్న సినిమా ఇది. ఇటీవలే ‘మ్యాడ్ స్క్వేర్’ సినిమాతో సంగీత్ శోభన్ మంచి విజయాన్ని అందుకున్నాడు. కాకపోతే, అది మల్టీస్టారర్.
‘మ్యాడ్ స్క్వేర్’ సీక్వెల్ కాగా, ముందుగా వచ్చిన సినిమా ‘మ్యాడ్’. మూడో సినిమా ‘మ్యాడ్ మ్యాక్స్’ కూడా సెట్స్ మీదకు వెళ్ళనుంది.
Also Read: కుక్క పని కుక్కే చెయ్యాలి.! గాడిద చెయ్యకూడదు.!
వరుసగా హిట్లు అందుకుంటున్న సంగీత్ శోభన్, ‘వర్షం’ సినిమా దర్శకుడు శోభన్ చిన్న కుమారుడు. శోభన్ పెద్ద కుమారుడు సంతోష్ శోభన్ కూడా హీరోగా పలు సినిమాలు చేసిన సంగతి తెలిసిందే.