Table of Contents
Niharika Konidela.. హ్యాపీ విమెన్స్ డే.. మహిళా దినోత్సవ శుభాకాంక్షలు.. అంటూ వాట్సప్ స్టేటస్‌లూ, ఫేస్ బుక్ పోస్టులూ, ట్వీట్లూ, ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్.. వీటిల్లోనే ఏడాదికోసారో, రెండు సార్లో వీలైతే, ఓ నాలుగైదుసార్లో మహిళల్ని గౌరవించే రోజులివి.
‘నా తల్లి, నా చెల్లి.. మాత్రమే గౌరవనీయులు. మిగతా వాళ్లంతా బజారు డాష్‌లే..’ ఇది చాలా మంది మెదళ్లలో పేరుకుపోయిన చెత్త. కాదు.. కాదు.! ఇదొక మెదళ్లను తొలిచేస్తున్న చీడ పురుగు. ఆ చీడ పురుగును చంపాలంటే, ఆ మెదళ్ల మీదే పురుగుల మందు చల్లాలి.
దురదృష్టమేంటంటే, మీడియాకి కూడా చీడ పట్టేసింది. మరి పురుగుల మందు చల్లాల్సిందే. ఎవరి మీద.?
నిహారిక.. ప్రముఖ సినీ నటుడు, నిర్మాత నాగబాబు కుమార్తె. బహుశా ఆ కుటుంబంలో ఆమె పుట్టకపోయి వుంటే, ఆమెకి ఈ రోజు ఇంతటి అవమానం జరిగి వుండేది కాదేమో.
Niharika Konidela.. పబ్బుకెళితే నేరమా.?
పబ్బుకి వెళ్లింది. అదే పెద్ద నేరమైపోయింది. ఆ పబ్బు మీద పోలీసులు రైడ్ చేశారు. పబ్బులో డ్రగ్స్ సరఫరా చేస్తున్నారని పోలీసులు తేల్చారు. ఆ సమయంలో పబ్బులో 150 మందికి పైగా వున్నారు.
అసలు డ్రగ్స్ ఎవరు తీసుకున్నారన్నది పోలీసులు తేల్చాల్సి వుంది. కానీ, మీడియా తీర్పులిచ్చేసింది. నిహారిక బ్యాగులో డ్రగ్స్ దొరికాయట. డ్రగ్స్ కేసులో అడ్డంగా బుక్కయిపోయిన నిహారిక.. అంటూ మీడియా కక్కుర్తి ప్రదర్శించింది.
ఏం.! సదరు మీడియా ప్రతినిధుల పిల్లల్లో ఆడపిల్లలు లేరా.? వాళ్లెవరూ పబ్బులకు వెళ్లరా.? మీడియా సంస్థల అధిపతుల కుటుంబాల్లో పబ్బులకు వెళ్లే ఆడపిల్లలు లేరని కుండ బద్దలుకొట్టి చెప్పగలిగే ధైర్యమెవరికి వుంది.?
పబ్‌కి వెళ్లడం నేరం కాదు. అలా పబ్బుకెళ్లడమే నేరమైతే లక్షల మంది అమ్మాయిలు, అబ్బాయిలూ నేరం చేసినట్లే.
ఈ రాజకీయమే.. ప్రజల్ని నాశనం చేస్తోంది.!
అక్రమాస్తుల కేసులో జైలుకెళ్లొచ్చి అధికార పీటమెక్కినవాళ్లున్నారు. హత్యలు చేసి, అత్యాచారాలు చేసినోళ్లు రాజకీయాల్లో వున్నత పదవుల్లో వున్నారు. మీడియా ఇలాంటి వాళ్ల కబంద హస్తాల్లో నలిగిపోతోంది.
ఇకపోతే, పెయిడ్ బ్యాచ్ కథ వేరే. సోషల్ మీడియాని దుర్వినియోగం చేయడమే వీళ్ల పని. నిజాలతో పని లేదు. ఇష్టమొచ్చినట్లు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడమే వీళ్ల పని.

రాజకీయ నాయకులు దేశాన్ని దోచేస్తుంటే, ఆ దోపిడీ కారణంగా, తామూ బాధితులుగా మారామనే సోయ లేని ఈ పెయిడ్ బ్యాచ్ ఒక అమ్మాయి మీద దుష్ప్రచారం చేయడానికి సిగ్గూ ఎగ్గూ వదిలేసి, గోతికాడి నక్కల్లా పని చేస్తున్నారు.
ఎంగిలి మెతుకులకు కక్కుర్తి పడే వీధికుక్కల కంటే హీనం వీళ్ల బతుకులు. బానిసత్వానికే పరాకాష్ట ఇది.
ఈ బానిసత్వాన్ని ఏమనాలి.?
తమ ఇంట్లో కూడా ఆడపిల్లలుంటారనీ, వాళ్లు పబ్బుకెళ్లినా, వాళ్లనీ వంకర కోణంలోనే చూస్తున్నామనీ తెలియని మైకంలో మొగ్గుతున్న ఈ బానిసల్ని ఏమనాలి.?
Also Read: పవన్ కళ్యాణ్ గర్జిస్తే అవెందుకు మొరుగుతున్నాయ్.!
నిహారిక (Niharika) తప్పు చేసిందా.? లేదా.? అది వేరే చర్చ. అసలిక్కడ నిహారిక గురించిన చర్చే అనవసరం. ఒక యువతి, ఒక మహిళ, ఒక ఆడకూతురు పబ్పుకెళ్లి తన జీవితం మీద చెరగని మచ్చ వేయించుకుంది.
ఎవరితోనో తెలుసా.? ఎవరి వల్లనో తెలుసా.? అర్ధ రూపాయికి అమ్ముడుపోయే మీడియా చేత. అనా పైసాకి కక్కుర్తి పడే బానిసల చేత.