నికీషాపటేల్ (Nikesha Patel) ఈ పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు. చేసినవి తక్కువ సినిమాలే అయినా, సాలిడ్ గ్లామర్‌తో కిర్రాకు పుట్టించిందీ ముద్దుగుమ్మ. పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన (Pawan Kalyan) ‘కొమరం పులి’ సినిమాతో టాలీవుడ్‌కి తెరంగేట్రం చేసింది.
తర్వాత కళ్యాణ్‌రామ్‌తో ‘ఓం’ సినిమాలో సాలిడ్‌గా కనిపించి మరోసారి మురిపించింది. ఆ తర్వాత పూరీ జగన్నాధ్ సోదరుడు సాయి రాం శంకర్‌తో ‘అరకు రోడ్డులో’ అనే సినిమాలో నటించింది. కానీ, ఈ సినిమా ఎప్పుడొచ్చిందో, ఎప్పుడు పోయిందో ఎవరికీ తెలీదు.
సినిమాల సంగతి అటుంచితే, పాప సో హాటే కాదు, సోషల్ మీడియాలో పిచ్చ యాక్టివ్. ఎప్పటికప్పుడే హాట్ హాట్ పిక్స్‌తో రెచ్చిపోయి ఫోటో సెషన్స్ చేయించుకుంటుంది. అస్సలు దాచుకోకుండా, ఆ పిక్స్‌ని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటుంది నికీషా పటేల్ (Nikesha Patel Bold).
ఆ హాట్ పోజులకు ఎట్రాక్ట్ కాని కుర్రకారుంటారా.? చెప్పండి. అయినా తన అందాలతో కుర్రకారును ఎంటర్‌టైన్ చేయడమే కాదండోయ్.. నికీషాలో ఇంకో టాలెంట్ కూడా ఉంది. ఎంటర్‌టైన్ చేయడమే కాదు, ఎంకరేజ్ చేస్తుంటుంది కూడా. నికీషాలోని ఆ అదనపు ఆకర్షణకే కుర్రోళ్లు పడిపోతుంటారు.
అందం, అభినయం, ఆకట్టుకునే గ్లామర్‌తో పాటు ఇలా స్పెషల్ క్వాలిటీస్ ఇంకెన్నో ఉన్నా, పాపం మన నిషా కళ్ల నికీషాకి అదృష్టమే కలిసి రావడం లేదు. ఒక్కసారి లక్ కలిసొస్తే చాలు, దున్నేస్తుందంతే.
తెలుగులో ప్రస్తుతం ‘గుంటూర్ టాకీస్ 2’ సినిమాలో నటిస్తున్న నికీషా పటేల్ తమిళంలో ఒకటీ అరా సినిమాలు చేస్తూనే ఉంది. ప్రస్తుతం ‘మార్కెట్ రాజా’ సినిమాలో నటిస్తోన్న నికీషా పటేల్ ఈ సినిమాకి సంబంధించి కొన్ని ఆశక్తికరమైన విషయాల్ని ఫ్యాన్స్‌తో పంచుకుంది.
ఈ సినిమాలో ఓ లిప్‌లాక్ సీన్ ఉందట. స్టోరీ చెప్పేటప్పుడు ఆ సీన్‌లో నటించడానికి నికీషా (Nikesha Patel Bold) ఒప్పుకోలేదట. డైరెక్టర్ ఎంత చెప్పినా కన్విన్స్ కాలేదట. కానీ, వన్స్ సినిమా స్టార్ట్ అయ్యాకా, డైరెక్టర్ కమిట్‌మెంట్ అమ్మడికి బాగా నచ్చిందట.
అంతేకాదు, ఆ సీన్ సినిమాకి ఎంత అవసరమో అనే విషయాన్ని డైరెక్టర్ తనకు ఓపిగ్గా వివరించిన వైనం ఆమెను ఇంప్రెస్ చేసిందట. అలా కథకు లిప్‌లాక్ సీన్ అవసరాన్ని బాగా స్టడీ చేసిన నికీషా పటేల్ చిట్ట చివరికి లిప్‌లాక్ సీన్‌లో నటించేందుకు ఒప్పుకుందట.
హాట్ హాట్ పిక్స్ పోస్ట్ చేస్తుంది కదా.. అని అమ్మడికి బోల్డ్ ఇమేజ్ అంటగట్టేస్తారేమో.. చూశారుగా నికీషా కమిట్మెంట్.
దటీజ్ నికీషా (Nikesha Lip Lock). అయినా, ఈ రోజుల్లో కూడా లిప్‌లాక్‌కి నో చెప్పే హీరోయిన్లున్నారా చెప్పండి. తొలి సినిమాతోనే ఒకటి కాదు, రెండు కాదు.. 24 కిస్సెస్‌లా ఎన్ని లిప్‌లాక్స్‌కైనా ఓకే చెప్పేస్తున్నారు అందాల భామలు.
తక్కువ టైంలో ఎక్కువ క్రేజ్ సంపాదించాలంటే, ఆ సీన్స్‌తోనే సాధ్యమవుతుందన్న కొత్త లాజిక్ కూడా వచ్చేసిందిప్పుడు. ఇదే లాజిక్‌తో మన నికీషా పటేల్‌కి కూడా అదృష్టం వరించి, ఆమె ఆశించిన బ్రేక్ ‘మార్కెట్ రాజా’ సినిమాతో దక్కాలని ఆమెతో పాటు మనం కూడా ఆశిద్దాం.