Nikhil Siddhartha Karthikeya 2.. చిన్న పిల్లాడేంటి, సినిమా హీరో అయితేనూ.! అంటారా.? ఔను, చిన్న పిల్లాడే. నిజానికి, చిన్న సినిమాలకి చెప్పుకోదగ్గ స్టార్ హీరో.
తన జనరేషన్ హీరోల్లో ఎవరికీ లేని సమస్యని నిఖిల్ ఎదుర్కొంటున్నాడు. అదే, సినిమా విడుదల పదే పదే వాయిదా పడుతుండడం.
త్యాగాలు చేసీ చేసీ విసిగిపోయాడు. ఏడ్చేశాడట కూడా.! అయినా, కనికరించడంలేదు.. ఎవరబ్బా.? ఎవరో, అందరికీ తెలుసు. కానీ, అతనికి మాత్రం ప్రతిసారీ ఏడుపే మిగులుతోంది.
‘కార్తికేయ-2’ మళ్ళీ వాయిదా.!
చెల్లి పెళ్ళి.. మళ్ళీ మళ్ళీ జరగాలంటాడో సినిమాలో కమెడియన్. ‘కార్తికేయ-2’ సినిమా వాయిదా.. మళ్ళీ మళ్ళీ.. అంటున్నాయ్ పరిస్థితులు.
జులై 22న విడుదల కావాల్సిన ‘కార్తికేయ-2’ కొన్ని కారణాల వల్ల, అది కూడా వేరే సినిమాల వల్ల వాయిదా పడింది. ఆగస్ట్ 5 కూడా పాయె.. ఆగస్ట్ 12 అనుకుంటే, అదిప్పుడు మళ్ళీ వాయిదా పడింది.
ఆగస్టు 13 ప్రస్తుతానికి లేటెస్ట్ రిలీజ్ డేట్.! అలాగని లాక్ చేసుకుంది ‘కార్తికేయ-2’ టీమ్. ఈ పరిస్థితిపై నిఖిల్ ఒకింత ఆవేదన వ్యక్తం చేశాడు.
Nikhil Siddhartha Karthikeya 2.. ఔను, నాకే ఎందుకీ సమస్య.?
ప్రతిసారీ తనకే ఎందుకు ఈ సమస్య వస్తుందో అర్థం కావడంలేదనీ, తననే ప్రతిసారీ త్యాగం చేయమంటున్నారనీ నిఖిల్ వాపోయాడు. తప్పదు, కొన్ని జీవితాలంతే.!
ఇందుకు కదా, తెలుగు సినిమా సర్వనాశనమైపోతున్నది.? ఈ రాజకీయాల వల్లనే కదా, తెలుగు సినిమా ‘వెలుగుల్ని’ కోల్పోతున్నది.
సరే, ‘కార్తికేయ-2’ సినిమా హిట్టవుతుందా.? లేదా.? అన్నది వేరే చర్చ. కానీ, ఓ సినిమాని పనిగట్టుకుని ఏడిపించడం ఎంతవరకు సబబు.?
Also Read: నభా నటేష్ ‘డేటింగ్’ పైత్యం.! ఛీ పాడు యాపారం.!
అన్నట్టు, ఏదో ఫ్రస్ట్రేషన్‌లో.. హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ మీద ‘ఆమె సినిమా ప్రమోషన్లంటే గాయబ్ అయిపోతుంది..’ అనేశాడు నిఖిల్.
కానీ, ఎంచక్కా నిఖిల్ మరియు ‘కార్తికేయ-2’ టీమ్‌తో కలిసి సినిమా తాజా విడుదల తేదీ ప్రకటన కార్యక్రమానికి అనుపమ హాజరయ్యింది.