Nikita Dutta Fitness Goals.. నాజూగ్గా వుండాలంటే, తగినంత వ్యాయామం చేస్తే సరి.! ఆపై, శరీరానికి అవసరమైనంత మాత్రమే ఆహారాన్ని తీసుకుంటే సరిపోతుంది.!
కానీ, అందాల భామలెందుకు మరీ అంతలా శరీరాన్ని కష్టపెట్టేస్తుంటారు.? జిమ్ముల్లోనే ఎక్కువ సమయం కేటాయిస్తే, ఇతరత్రా అనారోగ్య సమస్యలు రావా.?
వస్తాయ్.! అందులో డౌటేముంది.? ఈ రోజుల్లో ఏదన్నా పబ్లిసిటీ వ్యవహారమే. జిమ్ముల్లో కసరత్తులు చేస్తూ, తడిచిన అందాలతో ఫొటోలకు పోజులిస్తే, ఆ కిక్కే వేరప్పా.!
ఇది సోషల్ మీడియా యుగం.! కొన్ని సోషల్ మీడియా సంస్థలు, సెలబ్రిటీలకు అనూహ్యమైన రీతిలో పేమెంట్స్ ఇస్తుంటాయ్. సో, జిమ్ముల్లో అందాల భామలు కష్టపడటంలో ఓ అర్థముంది.!
Also Read: హృదయ పూర్వం సమీక్ష: కొంచెం ఇష్టం.. కొంచెం కష్టం.!
అది చూసి, అమ్మాయిలు.. జిమ్ముల్లో అవసరానికి మించి కష్టపడితే, అనారోగ్య సమస్యలు తప్పవు. సెలబ్రిటీలు, నిపుణుల పర్యవేక్షణలోనే కసరత్తులు చేస్తుంటారు.
Nikita Dutta Fitness Goals.. నికితా దత్తా.. అంతలా వంగిపోయిందేంటీ.!
శరీరాన్ని విల్లులా వంచేసిన ఈ బ్యూటీ పేరు నికితా దత్తా. బాలీవుడ్ బ్యూటీ. పలు సినిమాల్లోనూ, కొన్న వెబ్ సిరీస్‌లలోనూ.. అలానే కొన్ని మ్యూజిక్ ఆల్బమ్స్‌లోనూ నటించింది నికితా దత్తా.
సోషల్ మీడియాలో యాక్టివ్‌గా వుంటుంది. ఫిట్నెస్ విషయంలో చాలా కేర్ తీసుకుంటుంటుంది. జీరో సైజ్ ఫిజిక్ అనొచ్చా.? అంటే, అనేసుకోవచ్చు.. డౌటేముంది.?

మరీ, జిమ్ములో అంతలా కష్టపడటమెందుకు.? అంటే, తగినంత సమయం మాత్రమే జిమ్ కోసం కేటాయిస్తానని నికితా దత్తా ఓ ఇంటర్యూలో చెప్పింది.
చాలామందికి ఫిట్‌నెస్ మీద అవగాహన, ఆసక్తి వుండవనీ, తనలాంటి వాళ్ళు ఇలాంటి ఫొటోలు, వీడియోలు షేర్ చేయడం వల్ల, అవి చూసి, కొందరైనా ఇన్‌స్పైర్ అవుతారనీ అంటోంది నికిత.
అదీ నిజమే సుమీ.! తగినంత ఆహారం తీసుకోవడం.. అలానే తగినంత సమయం జిమ్‌కి కేటాయించడం.. నికిత దత్త ఆరోగ్య రహస్యమట.!
జిమ్ములో చెమట చిందించండి.. రకరకాలుగా శరీరాన్ని కష్టపెట్టండి. కానీ, నిపుణుల పర్యవేక్షణలోనే చెయ్యండి.!
అన్నిటికీ మించి, శరీరాన్ని విపరీతంగా కష్టపెట్టే వ్యాయామాలు చేసేముందు, వైద్యులను సంప్రదించడం తప్పనిసరి.
