Samantha Fit Perfect Healthy.. సమంత కొన్నాళ్ళ క్రితం తీవ్ర అనారోగ్య సమస్య బారిన పడింది. కొన్ని సినిమాల్ని వదిలేసుకోవాల్సి వచ్చింది కూడా.!
నిజానికి, సమంత తిరిగి మామూలు మనిషి అవుతుందని ఎవరూ అనుకోలేదు. అసలామెకే ఆ దైర్యం అప్పట్లో లేకుండా పోయింది.
కానీ, సమంత ప్రస్తుతం పూర్తిగా కోలుకుంది. అయినాసరే, సమంత ఎక్కడన్నా కనిపిస్తే, ఆమె ఆరోగ్యం కుదుటపడినట్లేనా.? అన్న ప్రశ్న తెరపైకొస్తుంటుంది.
బక్కగా.. పీలగా..
కెరీర్ తొలి నాళ్ళ నుంచీ సమంత ఎప్పుడూ బొద్దుగా కనిపించింది లేదు. కాకపోతే, బక్కచిక్కిపోతూ వస్తోంది. జీరో సైజ్ ఫిజిక్ అనుకోవచ్చు.

అలా బక్కగా కనిపించిన ప్రతిసారీ, అనారోగ్య సమస్య ప్రస్తావన తెరపైకొస్తుంటుంది. తాజాగా, అలాంటి ప్రశ్నలు సమంత చుట్టూ మరింత ఎక్కువగా చక్కర్లు కొడుతున్నాయి.
దాంతో, సమంతకి చిర్రెత్తుకొచ్చినట్లుంది. అయినాగానీ, చాలా ఓపిగా సమాధానమిచ్చింది.. అదీ సోషల్ మీడియా వేదికగా.
Samantha Fit Perfect Healthy.. ఇలా చేసి చూడండి..
సమంత అంటే వర్కవుట్స్.. వర్కవుట్స్ అంటేనే సమంత.. అనేంతలా, సమంత ఎప్పుడూ ఫిట్నెస్ స్టూడియోల్లో కనిపిస్తుంటుంది.
సంబంధిత వీడియోల్ని సమంత సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ, ఫిట్‌గా వుండండి.. ఆరోగ్యంగా వుండండి.. అని సందేశం ఇస్తుంటుందని తెలుసు కదా.!
Also Read: సమీక్ష: శ్రీవిష్ణు ‘సింగిల్’.. దీన్ని ‘హాస్యం’ అనగలమా.?
ఇప్పుడూ అలాంటి వీడియోనే పోస్ట్ చేసింది సమంత సోషల్ మీడియాలో. తనలా మూడు పుల్ అప్స్ చేసి, ఆ తర్వాత తన బక్కపలచతనం గురించి కామెంట్ చేయాలని సవాల్ విసిరింది సమంత.

ఎంత తేలిగ్గా ఆ వీడియోలో సమంత పుల్ అప్స్ చేసేసిందంటే.. నిజానికి, అలా ఒక్కటి అయినా చేయడం, చాలామందికి అసాధ్యం.
తాను ఫిట్ అండ్ పెర్‌ఫెక్ట్‌గా వున్నానని చెప్పడానికి, సమంత భలే మార్గాన్ని ఎంచుకుంది కదా.? నిజమే, సమంత పూర్తి ఆరోగ్యంతో వుంది.
సమంత ఆరోగ్యంపై ఎవరికీ ఎలాంటి అనుమానాలూ అవసరం లేదు.