రాధికా ఆప్టే ఇంత షాక్ ఇచ్చిందేంటీ.?
Radhika Apte
Radhika Apte Mom.. రాధికా ఆప్టే తెలుసు కదా.? నందమూరి బాలకృష్ణతో బ్యాక్ టు బ్యాక్ తెలుగులో రెండు సినిమాలు చేసేసింది. అందులో ఒకటి సూపర్ డూపర్ హిట్.!
హిట్టు కొట్టినా తెలుగులో హీరోయిన్‌గా నిలదొక్కుకోలేకపోయింది రాధికా ఆప్టే. అందుక్కారణాలనేకం. సౌత్‌లో ఓ హీరో తనను వేధించాడంటూ రాధికా ఆప్టే సంచలన వ్యాఖ్యలు చేసింది కొన్నాళ్ళ క్రితం.
ఆమె ఆటిట్యూడ్ కూడా సౌత్ దర్శక నిర్మాతలకు పెద్దగా నచ్చలేదన్నది ఇంకో వాదన. కారణాలేవైతేనేం.. తెలుగు, తమిళ సినిమాల్లో రాధికా ఆప్టే కెరీర్ తక్కువ కాలంలోనే ముగిసిపోయింది.
Radhka Apte Mom.. బోల్డ్ అండ్ బ్యూటిఫుల్..
బాలీవుడ్‌లో అడపా దడపా కనిపిస్తోన్న రాధికా ఆప్టేకి, బోల్డ్ అండ్ బ్యూటిఫుల్ హీరోయిన్.. అనే ముద్ర వుంది.
ఎప్పుడో పెళ్ళయిపోయినా, పబ్లిక్‌గా తన పెళ్ళి సంబంధిత విషయాల్ని ఎప్పుడూ ఎక్కడా రాధికా ఆప్టే చెప్పుకున్న దాఖలాల్లేవు.

గత కొంతకాలంగా రాధికా ఆప్టే మీడియాకి దూరంగా వుంటోంది. అయితే, తాజాగా రాధికా ఆప్టే బేబీ బంప్‌తో దర్శనమివ్వడంతో ఒక్కసారిగా మీడియాలో ఆమె పేరు మార్మోగిపోతోంది.
గుట్టుగా…
గుట్టుగా గర్భం దాల్చిన రాధికా ఆప్టే.. బేబీ బంప్‌తో కనిపించి అందరికీ షాకిచ్చిన రాధికా ఆప్టే.. అంటూ చిత్ర విచిత్రమైన కథనాలు మీడియాలో దర్శనమిస్తున్నాయి.
నిజానికి, ఇందులో షాకివ్వడానికేముంది.? ఆమె వ్యక్తిగత జీవితం.. ఆమె ఇష్టం. మాతృత్వం ఏ మహిళకైనా ఓ అత్యద్భుతమైన విషయం కదా.!
Also Read: త్రివిక్రమ్ రాయకపోవడానికి సమంతే కారణమా.?
ఆ మధుర క్షణాల్ని గోప్యంగా వుంచాలనుకుంటే అది తప్పెలా అవుతుంది.? అయినా, ఆమె ఏమీ అంత ‘గోప్యంగా’ వుంచే వ్యక్తి కూడా కాదు.
అందుకే, బేబీ బంప్‌తో కెమెరాల ముందుకొచ్చింది. మీడియా షాక్ అవడం మామూలే.! ఈ క్రమంలో అడ్డగోలు కథనాలు, ట్రోలింగ్ కూడా మామూలే.!