స్టన్నింగ్ బ్యూటీ నిక్కీ తంబోలీ (Nikki Tamboli) అనగానే, హిందీ బిగ్ బాస్ 14 కంటెస్టెంట్ గుర్తుకొస్తుంది.
కానీ, ఆమె ‘మోస్ట్ డిజైరబుల్ విమెన్ – టెలివిజన్ 2020’గా వార్తల్లోకెక్కింది.! తెలుగులో ‘తిప్పరా మీసం’, ‘చీకటి గదిలో చితక్కొట్టుడు’ తదితర తెలుగు సినిమాల్లోనూ నటించింది.
సోషల్ మీడియాలో యాక్టివ్‌గా వుండడమే కాదు, ఈ క్రమంలో బోల్డంత ఫాలోయింగ్ కూడా సంపాదించుకుంది నిక్కీ తంబోలీ.
Nikki Tamboli.. బిగ్ బాస్ మాత్రమే కాదు..
బిగ్ బాస్ హిందీ సీజన్ 14 కంటెస్టెంట్ అయిన నిక్కీ తంబోలి, కలర్స్ ఛానల్‌లోనూ ఓ రియాల్టీ షోలో కన్పించింది. అదే ఫియర్ ఫ్యాక్టర్. అదొక్కటే కాదు, మరో రియాల్టీ షోలోనూ సందడి చేసింది.

తాజాగా సోషల్ మీడియా వేదికగా హాట్ అండ్ వైల్డ్ ఫొటోల్ని షేర్ చేసింది నిక్కీ తంబోలి. రెడ్ కలర్ డ్రస్‌లో నిక్కీ మెరుపులకు అభిమానులు ఫిదా అవడం మామూలే.
అభిమానులు తన కుటుంబ సభ్యుల్లాంటివారని తరచూ చెప్పడం ఈ తరం అందాల భామలకి అలవాటే. నిక్కీ తంబోలి సైతం ఈ విషయంలో అందరికంటే ముందే వుంటుందేమో.!
Also Read: Rashmika Mandanna.. కాంతారా.! నన్ను బ్యాన్ చేయగలరా.?
అందుకేనేమో, నిక్కీ అంటే ఆమె అభిమానులు అంతలా ఆరాధించేస్తుంటారు.
తెలుగులోనే కాదు, తమిళంలోనూ ఓ సినిమా చేసింది నిక్కీ తంబోలీ. కొన్ని మ్యూజిక్ వీడియోల్లోనూ కనిపించింది నిక్కీ తంబోలి.