Nithya Menen Marriage.. సెలబ్రిటీల పెళ్ళిళ్ళగానే వాటికి బోల్డంత హైప్ క్రియేట్ అవుతుంటుంది. జనంలో బోల్డంత ఆసక్తి కనిపిస్తుంటుంది.!
అదిగో తోక.. అంటే, ఇదిగో పులి.. అన్న చందాన సెలబ్రిటీల పెళ్ళి పుకార్లకు ప్రచారం విపరీతంగా జరుగుతుండడం తరచూ చూస్తూనే వున్నాం.
తాజాగా, ఈ లిస్టులోకి నిత్యా మీనన్ పెళ్ళి పుకారు వచ్చి చేరింది. మలయాళ సినీ పరిశ్రమకు చెందిన ఓ ప్రముఖ నటుడితో నిత్యా మీనన్ పెళ్ళి.. అనేది ఓ గాసిప్.
Nithya Menen Marriage.. నిత్యా మీనన్‌కి తెలుసా.? లేదా.?
తన పెళ్ళి గురించి వస్తున్న పుకార్లపై నిత్యా మీనన్ (Nithya Menen) తనదైన స్టయిల్లో స్పందించింది. అసహనం వ్యక్తం చేసింది కూడా.!

‘నా పెళ్ళంట కదా.! నాకు విషయం చెప్పాలి కదా.? వరుడెవరో తెలియకుండా నేను పెళ్ళికి ఎలా సిద్ధమవ్వాలి.? ఇంతకీ నా పెళ్ళెప్పుడు.?’ అని సెటైర్లేసింది మలయాళ బొద్దుగుమ్మ నిత్యా మీనన్.
‘ఇలాంటి పుకార్లను ప్రచారం చేసే ముందు.. మెయిన్ స్ట్రీమ్ మీడియా నన్ను సంప్రదించి వుంటే బావుండేది..’ అంటూ నిత్యా మీనన్ (Nithya Menen) వ్యాఖ్యానించింది.
గాసిప్పులంటే అంతే మరి.!
గాసిప్పులు ఎలా పుడుతుంటాయ్.? నిప్పు లేకుండా పొగ వచ్చేస్తున్న రోజులివి. అలాగే గాసిప్స్ కూడా. వాటిల్లో కొన్ని నిజాలవుతుంటాయి, కొన్ని పుకార్లుగా మిగిలిపోతాయ్.!
‘మేం విడిపోవడమేంటి.?’ అంటూ విడాకుల పుకార్లపై గుస్సా అయినోళ్ళే, అధికారికంగా విడాకుల ప్రకనటలు విడుదల చేసిన సందర్భాలున్నాయ్.
Also Read: విక్రమ్ భయపెట్టాడా.? ఆయన పేరుతో భయపెట్టారా.?
పెళ్ళి విషయంలోనూ అంతే.! ‘అబ్బే, నేనింకా చిన్న పిల్లని, నాకు అప్పుడే పెళ్ళేంటి.?’ అని పెళ్ళి పుకార్లని ఖండించిన చాలామంది హీరోయిన్లు, రోజులు తిరగకుండానే పెళ్ళి చేసేసుకున్న సందర్భాలూ లేకపోలేదు.
అద్గదీ అసలు సంగతి. ఇంతకీ, నిత్యా మీనన్ (Nithya Menen Wedding) పెళ్ళి సంగతేంటి.? ప్రస్తుతానికైతే, ఆమె ఖండించింది గనుక, పెళ్ళి పేరుతో ప్రచారంలో వున్న వార్తా కథనాలన్నీ ఉత్త పుకార్లేనని అర్థం చేసుకోవాలి.